త‌గ్గ‌ని `సారంగ దరియా` జోరు.. 4 నెల‌ల్లో 25 కోట్లు!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం నుంచి ఆ మ‌ధ్య సారంగ దరియా లిరిక‌ల్ సాంగ్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు […]

`మా` ఎన్నిక‌లు..రేసులోకి జీవితా రాజశేఖర్..?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్ రంగంలోకి దిగ‌గా.. మ‌రోవైపు మంచు వారి అబ్బాయి మంచు విష్ణు కూడా పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రేసులో జీవితా రాజ‌శేఖ‌ర్ పేరు కూడా వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం మా కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న జీవితా రాజ‌శేఖ‌ర్ అనూహ్య నిర్ణయం తీసుకుని మా ప్రెసిడెంట్ రేసులో నిల‌వ‌బోతున్నార‌నే వార్త ఇండ‌స్ట్రీ […]

ఆ యంగ్ హీరోతో రొమాన్స్‌కు సిద్ధ‌మైన పాయ‌ల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, ఎం. వీర‌భ‌ద్రం కాంబోలో తెర‌కెక్క‌బోతోన్న తాజా చిత్రం కిరాత‌క‌. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై డా. నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ భామ‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న పాయ‌ల్ రాజ్‌పూత్ ఆదితో రొమాన్స్ చేసేందుకు సిద్ధ‌మైంది. అవును, కిరాత‌క‌లో పాయ‌ల్‌నే హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్రం క‌న్ఫార్మ్ […]

చీర‌క‌ట్టులో ర‌ష్యా రోడ్ల‌పై తాప్సీ ప‌రుగులు..ఫొటో వైర‌ల్‌!

తాప్సీ పన్ను.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది తాప్సీ. మొద‌టి సినిమాతోనే మంచి న‌టిగా మార్కులు కొట్టేసిన ఈ భామ‌.. ఆ త‌ర్వాత అడ‌పా త‌డ‌పా సినిమాలు చేసి బాలీవుడ్‌కు మాకాం మార్చేసింది. ప్ర‌స్తుతం తెలుగు ప్రేక్ష‌కులకు దూర‌మై బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌.. సోద‌రి షాగున్‌తో క‌లిసి ర‌ష్యాలో టూర్ చేస్తోంది. వెకేష‌న్‌ను ఎంజాయ్ […]

చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో రికార్డు..ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ తాజాగా రీ స్టార్ట్ అయింది. చ‌ర‌ణ్ కూడా షూట్‌లో పాల్గొన్నారు. అలాగే ఆచార్య‌లోనూ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రామ్ చ‌రణ్ సోషల్ మీడియాలో అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌డు. ఎప్పుడో ఒక‌సారి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టి స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫాలోవ‌ర్స్ […]

నిర్మాత సురేష్ బాబుకే టోక‌రా వేసిన కేటుగాడు..ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ బాబుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. వ్యాక్సిన్ల పేరుతో ఓ కేటుగాడు సురేష్ బాబు వ‌ద్ద నుంచి రూ.ల‌క్ష నొక్కేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు ఆఫీస్‌కు ఫోన్‌ చేశాడు. అది నిజమని నమ్మిన సురేష్ బాబు మేనేజర్‌.. అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అనంత‌రం అత‌డికి ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. చివ‌ర‌కు […]

`లైగ‌ర్‌`కు రూ. 200 కోట్ల ఆఫ‌ర్‌..విజ‌య్ దేవ‌ర‌కొండ షాకింగ్ రిప్లై!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం లైగ‌ర్. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో విజ‌య్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. లైగ‌ర్‌ను అన్ని భాషల్లోను నేరుగా డిజిట‌ల్ రిలీజ్ కి ఇవ్వమంటూ ఓ పాపుల‌ర్ […]

ప్ర‌ముఖ ఓటీటీలో నితిన్ `మాస్ట్రో`..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో భా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన‌ అంధధూన్ చిత్రానికి ఇది రీమేక్. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ […]

చీర‌లో మంచు ల‌క్ష్మీ మాస్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

ప్ర‌ముఖ నటి, నిర్మాత, సీనియ‌ర్ హీరో మోహ‌న్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ల‌క్ష్మీ.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాలు చేసినా స‌రైన బ్రేక్ రాలేదు. అయితే స్మాల్ స్క్రీన్‌పై మాత్రం ఈ భామ బాగానే స‌క్సెస్ అయింది. ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా, జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రించి.. సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే […]