బాస్ ఈజ్ బ్యాక్!

ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు… రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరినోట విన్నా ఇప్పుడు ఇదే మాట! అవును బాస్ ఈజ్ బ్యాక్!! ఈ నెల 23న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. దర్శకుడు వి.వి. వినాయక్ మెగాఫోన్ పట్టుకుని ఇలా యాక్షన్ చెప్పారో లేదా… అలా ఆల్ ఛానెల్స్ లోనూ బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది. మెగాస్టార్ మూవీకి సంబంధించిన ముచ్చట్లలను కోట్లాది వీక్షకులకు ఛానెల్స్ క్షణాల్లో చేరవేశాయి. ప్రత్యేక బులిటెన్లను ప్రసారం చేశాయి. ఈ […]

కబాలి స్టోరీ అంతా అక్కడేనా!

రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా ప్రారంభమైనప్పుడే ఇదో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథాంశమని దర్శకనిర్మాతలు చెప్పేశారు. తాజాగా దీనికి సంబంధించి దర్శకుడు పా రంజిత్ మరిన్ని వివరాలు వెల్లడించాడు. తమ సినిమాలో హీరో పూర్తి పేరు కబలీశ్వరన్. బ్రిటీష్ పాలన సమయంలో ఆయన కుటుంబం మలేసియాకు వలస వెళ్తుంది. మలేసియాలోనే పెరిగి పెద్దవాడైన కబాలిని అక్కడి భారతీయ కార్మికుల కష్టాలు కదిలిస్తాయి. వారి సంక్షేమం కోసం కబాలి ఏం చేశారన్నదే తమ సినిమా అని రంజిత్ వివరించాడు. ‘కబాలి’ […]

ఫ్యాన్స్ తో పవన్ ఫేస్ టు ఫేస్

తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. విదేశాల్లోను మెగా బ్రదర్ పవన్ కల్యాణ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయన్ను తరచూ ఆహ్వానిస్తూ ముఖాముఖి మాట్లాడాలని ఉత్సాహపడతారు. ఇలాంటి ఇన్విటేషన్ మేరకు పవన్ త్వరలోనే లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణం జులై 9న ఉంటుందని సమాచారం. ‘యునైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్’ (యుక్తా) వారి ఆధ్వర్యంలో జరగనున్న ‘జయతే కూచిపూడి’ కార్యక్రమం ముగింపోత్సవానికి పవన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. జయతే కూచిపూడి’ […]

నివేదా థామస్ కి ఒకే చెప్పిన NTR

ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కల్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ చిత్రం పనులు జోరందుకున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాకి కథను అందించిన వక్కంతం వంశీయే డైరక్టర్‌ కూడా. ఈ మూవీలో హీరోయిన్ క్యారక్టర్‌కు నటన పరంగా ప్రాధాన్యత ఉందట. దీంతో చిత్రబృందం కథానాయిక కోసం బాగానే కసరత్తు చేసి..నివేదా థామస్‌ దగ్గర ఆగిందట. ‘జెంటిల్ మన్’ సినిమాలో నివేదా […]

మామ కాబోతున్న స్టార్ హీరో

తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో విక్రమ్ త్వరలో మామగారు కాబోతున్నాడు. చియాన్ కూతురు అక్షిత త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్రమ్ సన్నిహితులు తెలిపారు. చెన్నైలోని చాలా ఫేమస్ అయిన సీకే బేకరీ యజమాని రంగనాథన్ కుమారుడు మను రంజిత్ ను అక్షిత పెళ్లాడనుంది. అక్షిత-రంజిత్ ఎంగేజ్ మెంట్ కోసం విక్రమ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. జూలై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో వీళ్లిద్దరి నిశ్చితార్ధం జరగనుంది. […]

ఎపిలో బి.కాం కంప్యూటర్స్ క్లోజ్!

బికాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుకు మంగళం పాడేయడానికి ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ప్రణాళిక సిద్దం చేసింది. ఉన్నత విద్యావిధానంలో మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇతర కోర్సులపై ప్రభావం ఎలా వున్నా బి.కాం కంప్యూటర్స్ మాత్రం షేపులు మారిపోతున్నాయి. అసలు ఆ కోర్సు పేరే ఇకపై వినబడడం కష్టమేననిపిస్తుంది. కంప్యూటర్ ప్రభంజనంతో అకౌంటెన్సీలో పట్టు సాధించడం కోసం డిగ్రీలో బి.కాం చదివే విద్యార్థులకు కంప్యూటర్ అకౌన్సీమీద పట్టుండాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన కోర్సు […]

అందుకే ఆమెకు ఛాన్స్ ఇచ్చిన బన్నీ!

సునీల్‌తో ‘కృష్ణాష్టమి’ సినిమాలో నటించిన నిక్కీ గల్రాని, ‘బుజ్జిగాడు’ ఫేం కన్నడ బ్యూటీ సంజన చెల్లెలు. మొదటి సినిమా ఫెయిల్‌ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి ఫాలోయింగ్‌ బాగానే వచ్చింది ఆ సినిమాతో. స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బావుంది. డాన్సులు బాగా చేస్తోంది. నటనలో కూడా మంచి మార్కులే వేయించుకుంది. అక్క సంజనతో పోలిస్తే చాలా ఎక్స్‌ట్రా క్వాలిటీస్‌ ఉన్నాయి ఈ ముద్దుగుమ్మలో. అందుకే తెలుగులో మరో ఛాన్స్‌ దక్కించుకుంది. అది కూడా పెద్ద హీరో పక్కనే. అల్లు అర్జున్‌ […]

టి కాంగ్రెస్ కి భారమవుతున్న ఆ ఇద్దరు!

తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారే తప్ప, తెలంగాణలో పార్టీని బాగు చేయలేకపోతున్నారు. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యత ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నాయకత్వాలదే. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసు పార్టీకి నాయకత్వమే లేదు. అది విభజనతో జరిగిన నష్టం. తెలంగాణలో అలా కాదు కదా. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ దెబ్బకి కాంగ్రెసు నాయకత్వం కుదేలైంది. ‘మేం తెలంగాణ ఇచ్చినా, మీరు పార్టీని బాగు చేయలేకపోతున్నారు’ అని తెలంగాణ నుంచి వెళ్ళిన ప్రతి నాయకుడికీ సోనియాగాంధీ తలంటు పోసేస్తున్నారట. […]

మహేష్ అందుకే సైలెంట్ గా ఉన్నాడా?

‘బ్రహ్మూెత్సవం’ తర్వాత మహేష్‌ కొంచెం సైలెంటయ్యాడు. మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుండగా, దానికి సంబందించి ఏ చిన్న న్యూస్‌ కూడా ఇంకా రివీల్‌ కావడంలేదు. ‘బ్రహ్మూెత్సవం’ ఎఫెక్ట్‌తో మహేష్‌, ఆచి తూచి వ్యవహరిస్తుండడమే దీనికి కారణమట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమాకి ఓవర్‌గా హైప్‌ క్రియేట్‌ చేశారు. ఆ సినిమా అంత ఓవర్‌గానే ఫెయిల్‌ అయ్యింది. మహేష్‌ కెరీర్‌లో నే ఈ సినిమా డిజాస్టర్‌ అని ప్రూవ్‌ అయ్యింది. అందుకే తన నెక్స్ట్‌ సినిమా విషయంలో కొంత గోప్యంగా […]