తన వందవ చిత్రం శాతకర్ణితో మాంఛి జోష్ మీదున్న బాలయ్య.. ముందస్తు కసరత్తు చేశాడో.. చేయలేదో తెలియదు కానీ.. అనూహ్యంగా తన తదుపరి చిత్రం తన తండ్రి, ఏపీ ముద్దుబిడ్డ ఎన్‌టీఆర్ పైనే ఉంటుందని ప్రకటించాడు. అనన్యసామాన్యమైన ప్రతిభతో అటు సినీ ఇండస్ట్రీలోనూ ఇటు రాజకీయంగానే వెలిగిన ఎన్‌టీఆర్ జీవిత చరిత్రను చలన చిత్రంగా రూపొందిస్తానని ప్రకటించాడు. అంతేకాదు, ఆ మూవీకి హీరోగా(అంటే ఎన్‌టీఆర్) తానే నటిస్తానని కూడా బాలయ్య చెప్పాడు. దీంతో ఈ మూవీ టాక్స్ […]
Author: admin
పన్నీర్ యాక్షన్.. శశికళ లెక్కలు తారుమారు!
తమిళనాడులో సీఎం సీటు కోసం జరుగుతున్న యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు రోజుల కిందటి వరకు ప్రశాంతంగా అంతా జరిగిపోతుందని అనుకున్న పరిస్థితిలో పన్నీర్ పేల్చిన బాంబు రాష్ట్ర అధికారం పక్షంలో మరో వర్దా తుఫానును సృష్టించింది. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలున్న అధికార అన్నాడీఎంకేలో అధికారం చేపట్టాలనుకునే వారు కనీసం 117 మంది ఎమ్మెల్యేల మెజారిటీని పొంది ఉండాలి. ఈ నేపథ్యంలో దాదాపు 130 మంది ఎమ్మెల్యేలు తాను గీసిన గీత దాటరని చెప్పిన శశికళ.. […]
పన్నీర్ వెంట టీడీపీ.. శశికళ వెంట వైకాపా!
తమిళనాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జరుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. పురుట్చితలైవి, అమ్మ జయలలిత హఠాన్మరణంతో ఖాళీ అయిన తమిళనాడు సీఎం సీటును ఆపద్ధర్మ సీఎంగా అమ్మకు అత్యంత విధేయుడు, ఆదర్శప్రాయుడు అయిన పన్నీర్ సెల్వం తమిళనాడుసీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ సీటుపై కన్నేసిన శశికళ.. పన్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రకటించుకున్నారు. […]
టీడీపీలో మొదలైన మంత్రి వర్గ విస్త`రణం`
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు జోరందుకున్న తరుణంలో.. వివిధ జిల్లాల్లో అసంతృప్తి సెగలు చెలరేగుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తుండటంతో.. సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కర్నూలుకు చెందిన భూమా నాగిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కేబినెట్‌లో బెర్త్ ఖాయమని తెలుస్తున్న వేళ,, ఆ జిల్లాల్లో సీనియర్ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా ఆ నాయకులకు చెందిన ప్రత్యర్థులు.. పార్టీని వీడేందుకు […]
తెలంగాణలో ప్లాప్ హీరోయిన్ కొత్త పార్టీ
తెలంగాణలో టీఆర్ఎస్‌కు పోటీగా సరికొత్త పార్టీ రాబోతోంది. సినీ వినీలాకాశంలో స్టార్‌గా వెలుగొంది.. రాజకీయ నేతగా మారిన విజయశాంతి మరోసారి పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో చేరి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన ఆమె.. మరోసారి రాజకీయ తెరపై మెరిసేందుకు తహతహలాడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తీవ్రంగా పోరాడిన రాములమ్మ.. సెకండ్ ఇన్నింగ్స్‌కు తెరతీయబోతున్నారు. సొంత పార్టీతోనే ఇక రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి!! రాములమ్మగా వెండితెరపై ఓ […]
వైసీపీ ఎంపీతో టీడీపీ మంత్రి రహస్య మంతనాలు
మంత్రి వర్గ విస్తరణలో ఈసారి వేటు తప్పదు అని భావిస్తున్న వారిలో మంత్రి రావెల కిశోర్‌బాబు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కొంత కాలంనుంచి ఆయన వ్యవహార శైలి పార్టీకి తలనొప్పులు తెస్తున్న విషయం తెలిసిందే! ఇదే సమయంలో ఆయన అకస్మాత్తుగా అదృశ్యమవడం చర్చనీయాంశమైంది, దీనిపై విజిలెన్స్ కమిటీ సీఎంకు నివేదిక కూడా అందించింది. ఇందులో ఏముందో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు! ఆ సమయంలో ఆయన వైసీపీ ఎంపీతో రహస్య మంతనాలు కొనసాగించారని తేలడంతో.. ఇప్పుడు రాజకీయాల్లో […]
సింగం 3 అభిమానులకు మళ్ళీ నిరాశే
తమిళ్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నిర్మించిన సింగం 3 కి మొదటినుంచి తెలుగులో రిలీజ్ చేయటానికి అనేక ఆటంకాలు కలుగుతూనే వున్నాయి. అన్ని అడ్డంకుల్ని దాటుకుని ఈరోజు రిలీజ్ అవటం కాయమవ్వగా ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది. ఈరోజు తెలుగు, తమిళ రాష్ట్రాలలో ఒకేసారి రిలీజ్ అవ్వాల్సి ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి బ్రేక్ పడింది. అయితే దీనికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు కానీ ఫిలింనగర్ లో మాత్రం ఫైనాన్స్ క్లిరెన్స్ చేయకపోవటం వల్లనే […]
ఏపీలో ఇద్దరు మంత్రుల వ్యహారం పార్టీలో పెద్ద దుమారమే
విశాఖ జిల్లా అధికారులు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు తగ్గకపోగా.. ఇంకా ముదిరి పాకానపడుతున్నాయి. వీటిని తగ్గించేందుకు అధి నాయకత్వం కూడా చర్యలు తీసుకోకపోవడంతో వీరి వర్గ పోరు తీవ్రమవుతోంది. వీరి మధ్య వర్గ పోరు ఎలా ఉన్నా.. అధికారులు మాత్రం తీవ్రంగా నలిగిపోతున్నారని సమాచారం. ఇటీవల విశాఖలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై ఆ జిల్లా మంత్రి అసంతృప్తి వ్యక్తంచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రులు గంటా […]
బ్రేకింగ్: టీఆర్ఎస్ తో టీడీపీ పొత్తు
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది! రాష్ట్రం విడిపోయాక తీవ్రంగా నష్టపోయింది టీడీపీనే! అలాగే ఇప్పటికే మినీ తెలుగుదేశంలా టీఆర్ఎస్ మారిపోయిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఓటుకు నోటు వ్యవహారం బయటపడిన దగ్గర నుంచి టీఆర్ఎస్-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితి మారిపోయింది, మరి ఉప్పు నిప్పు లాంటి పార్టీలు రెండూ కలిసి పనిచేస్తాయని కలలో కూడా ఊహించలేం కదా! కానీ ఇప్పుడు ఇలాంటి పరిణామాలు రాబోతున్నాయట! వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ – టీడీపీతో బీజేపీ […]