కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం రసకందాయంగా మారింది. ముఖ్యంగా ఆళ్లగడ్డ. నంధ్యాల ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ వైసీపీని వీడి టీడీపీలో చేరిన నాటినుంచి జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి. వీరి రాకతో శిల్పా వర్గం, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే శిల్పా వర్గం పార్టీ మారే అలోచనతో ఉంటే.. ఇప్పుడు గంగుల వర్గం కూడా దాదాపు పార్టీ మారడం ఖాయమైపోయింది. ఇక రేపో మాపో అన్నట్లు […]
Author: admin
” నేను లోకల్ ” ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘నేను లోకల్’ ఫస్ట్ షో నుంచే ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సంక్రాంతికి శతమానం భవతి సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు పది హేను రోజులకే నేను లోకల్ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. నేను లోకల్ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసినా కూడా స్టడీ వసూళ్లు సాధిస్తూ ఫస్ట్ వీక్ ముగిసే టైంకే లాభాల బాట పట్టేసింది. రెండో వారంలో కూడా చెప్పుకోదగ్గ థియేటర్లు […]
మహిళా పార్లమెంటు వేదికగా.. బ్రాహ్మణి మామ గొప్పలు!
విపక్షాలు గొంతు చించుకుంటున్నదే నిజమా? అని అనిపించే విధంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు కోడలు బ్రాహ్మణి. విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన మహిళా పార్లమెంటుకు శనివారం హాజరైన ఆమె.. మైకు పుచ్చుకున్న దగ్గర నుంచి తన మామ చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తడానికే ప్రియార్టీ ఇచ్చారు. ముఖ్యంగా ఆయన గత పదేళ్ల కాలం నుంచి ఇప్పటి వరకు చేపట్టిన అన్ని పథకాలను పేర్లతో సహా పేర్కొన్న బ్రాహ్మణి.. మామ పొగడడంతో కోడలు మించి పోయిందనే కీర్తిని మూటగట్టుకున్నారు. […]
మహిళా పార్లమెంటుపై రోజా పగ తీర్చుకుందా?!
ఏపీ సీఎం చంద్రబాబు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న మహిళా పార్లమెంటు విషయంలో ఆది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు సంధిస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా.. శనివారం పెద్ద రచ్చ సృష్టించి చర్చకు దారితీసింది. మహిళా పార్లమెంటు ఆహ్వానం మేరకు శనివారం ఆమె గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి పార్లమెంటు జరిగే మహా సంగమ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే, విమానాశ్రయంలోనే ఆమె పోలీసులపై విరుచుకుపడింది. బౌద్ధ గురువు దలైలామా […]
చిన్నమ్మ కోటరీకి బీటలు! విద్యా మంత్రి పన్నీర్ గూటికి జంప్!
తమిళనాట రాజకీయాలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు తిరుగులేదని అనుకున్న చిన్నమ్మ.. ఆశలు ఒక్కసారిగా ఆవిరవుతున్నాయి. పన్నీర్ సెల్వాన్ని విజయవంతంగా సీఎం సీటు నుంచి రాజీనామా చేయించిన చిన్నమ్మ శశికళ.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. ఇంతలో కథ అడ్డం తిరిగింది. పన్నీర్ తిరుగుబావుటా ఎగురేశారు. దీనికి వెనుక ఎవరున్నారు? ముందు ఎవరున్నారు? అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా సోషల్ మీడియా వేదికగా […]
ఆంధ్రాలో తెలంగాణ వాదం వదిలేసిన ఎంపీ కవిత..!
తెలంగాణ ప్రాంతీయ వాదం, సాహిత్యాన్ని, కళలను, సంస్కృతి. సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత ఎప్పుడూ ముందుంటారు. ఏ వేదిక అయినా, ఎక్కడయినా ఆమె ఈ అంశాలపై అనర్గళంగా మాట్లాడగలరు. అయితే ఇప్పుడు అమరావతిలో ఏర్పాటుచేసిన జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరైన ఆమె.. తన ప్రసంగంలో ఎక్కడా వాటి జోలికి పోవడం చర్చనీయాంశమైంది. మరి ఎక్కడయినా తెలంగాణ వాదాన్ని భుజాన కెత్తుకునే ఆమె.. ఈసారి అలా చేయకపోవడంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నవ్యాంధ్ర రాజధాని […]
టీ టీడీపీలో ముదిరిన ముసలం
తెలంగాణ తెలుగుదేశంలో ముసలం ముదిరిపోయింది. నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొంతకాలంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తీరుపై ప్రెసిడెంట్ ఎల్.రమణ తీవ్రంగా అసహనానికి గురవుతున్నారు. దీంతో ఆయన సైకిల్ దిగి కారెక్కే సూచనలు ఉన్నాయని పుష్కలంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇది ఇప్పుడు నిజం కాబోతోందట. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైపోయిందట. ముఖ్యంగా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్రబెల్లితో రమణ ప్రత్యేక సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో గులాబీ దళంలో క్లారిటీ వచ్చిందట. […]
” సింగం-3 ” ఫస్ట్ డే తెలుగు+తమిళ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్ 3 ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా 2వేల థియేటర్లలో భారీగా రిలీజ్ అయ్యింది. సింగం సీరిస్‌లో ఇంతకు ముందు వచ్చిన యముడు – సింగం సూపర్ హిట్ అవ్వడంతో మూడో సినిమా సింగం-3 పై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు గురువారం థియేటర్లలోకి వచ్చింది. దసరా – దీపావళి – డిసెంబర్ 16, డిసెంబర్ 23, జనవరి 26 […]
హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..
గత వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరడంతో అంతా సద్దుమణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, తన బావమరిది బాలకృష్ణ పీఏ శేఖర్‌పై వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖర్‌పై వేటు వేయడంతో మొదలైన ఈ ప్రయాణంలో ఇంకా చాలామంది బాలయ్య సన్నిహితులు బయటికొచ్చే అవకాశముందని సమాచారం! ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. […]