ప్రపంచంలో వ్యాపారం – సినిమాలు – రాజకీయాలు ఇలా ఏ కీలక రంగాలు చూసుకున్నా వారసత్వం అనేది కామన్. వారి తండ్రి, తాతల నుంచి వచ్చిన ఇమేజ్‌ను అందిపుచ్చుకుని వారసులు దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తోందే. కొత్తేం కాదు. ఈ క్రమంలోనే ఏపీలో అధికార టీడీపీలో సైతం ఇప్పుడు మూడో తరం రాజకీయ వారసులు అధికారం, పదవి కోసం రేసులో దూసుకుపోతున్నారు. ఈ మూడో తరం లీడర్లలో ముందుగా ఏపీ సీఎం నారా […]
Author: admin
బాలయ్య 101 పూరీతోనే….
నటసింహం బాలకృష్ణ 100 వ.సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయినప్పటినుంచి బాలయ్య 101 వ సినిమాగురించి రోజుకొక న్యూస్ వస్తూనే వుంది.మొదట కృష్ణ వంశి తో రైతు సినిమా అనుకున్నారని, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమా అని పూరి జగన్నాధ్ తో సినిమా ఉంటుందని ఆదిత్య 999 అని రకరకాల న్యూస్ వచ్చింది. అయితే వీటిలో ఏది ఫైనల్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఫిలింనగర్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. బాలయ్య 101 వ సినిమా […]
బాబుకు షాక్:ఏపీ కేబినెట్ ప్రక్షాళన సెగలు రేపడం ఖాయం
ఏపీలో మంత్రివర్గ విస్తరణ సాక్షిగా అధికార టీడీపీలో పెద్ద లుకలుకలు స్టార్ట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. పైకి మాత్రం వాతావరణం అంతా సవ్యంగానే ఉన్నట్టు కనిపిస్తోన్నా లోపల మాత్రం అసంతృప్తి గాలి బుడగలా ఉందని…అది ఎప్పుడైనా ఢాంన పేలడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగనుంది. 7 గురు మంత్రులను తపించే బాబు కొత్తగా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పార్టీలో సామాజికవర్గాలు – ప్రాంతాలు – సీనియారిటీని […]
సర్దార్ రూట్లో కాటమరాయుడు
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్ తీరు చూస్తుంటే పవన్ చివరి చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్‌ను తలపిస్తోందన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కాటమరాయుడు షూటింగ్ విషయంలో ముందునుంచి ప్లానింగ్‌తో లేరు. తీరా ఇప్పుడు ఉగాదికి రిలీజ్ డేట్ ఇవ్వడంతో షూటింగ్‌ను హడావిడిగా ఫినిష్ చేసేందుకు కంగారు పడుతున్నారు. కాటమరాయుడు సినిమా చాలా వరకు పూర్తయ్యింది. అయితే కొన్ని సీన్లు పవన్‌కు నచ్చకపోవడంతో రీ షూట్లు చేయాలని దర్శకుడు డాలీని ఆదేశించాడట. ఇక పాటలు కూడా […]
హైకమాండ్‌కు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ
తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదిరిపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా అధికారంలోకి రాలేకపోయినందుకు ఒకపక్క హైకమాండ్ తీవ్ర మథనపడుతుంటే.. వచ్చే ఎన్నికల్లో గెలిచి కొంతవరకైనా స్వాంతన చేకూర్చాలనే అభిప్రాయం ఏ ఒక్కరిలోనూ కనిపించడంలేదు. ఆధిపత్య పోరుతో నాయకులు.. ఒకడుగు ముందుకు వందడుగులు వెనక్కి వేస్తున్నారు. కలసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం మాని,,ఎవరికి వారు తమ స్వలాభాన్ని చూసుకుంటన్నారు. ముఖ్యంగా పీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీంతో […]
పళనిపై కక్ష సాధింపులకు కేంద్రం స్కెచ్ రెడీ
అమ్మ మరణం తర్వాత తమిళనాడులో పట్టు సాధించాలని… మాజీ సీఎం పన్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చక్రం తిప్పాలని భావించిన కేంద్రం ఆశలకు పళనిస్వామి రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసనసభలో జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించడంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంతటితో అయిపోలేదు, నిన్ను వదిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీచేస్తోంది. ఆయన గత చరిత్రను తవ్వి.. లొసుగులను బయటకు […]
కోదండరాంపై టీఆర్ఎస్ ” కులాస్త్రం “
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. అన్ని వర్గాలను సమైక్యం చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. కోదండరాం ఎదురుదాడితో ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. దీని నుంచి బయటపడేందుకు ఆయన `కులం` కార్డును తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఎంపీ బాల్క సుమన్.. కోదండరాం రెడ్డి అని సంబోధించి సరికొత్త చర్చకు దారి తీశారు. ప్రస్తుతం దీనిపై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని సమాచారం. ఒకపక్క తాము సేఫ్ సైడ్‌లోకి […]
బాలయ్య 101వ సినిమా ఫిక్స్.. టైటిల్స్ కూడా రెడీ
తన 100వ సినిమా `గౌతమీ పుత్ర శాతకర్ణి`తో తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని చిరస్థాయిగా నిలుపుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ.. తదుపరి సినిమాపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు శుభవార్త!! ఆయన 101 సినిమా దాదాపు ఖరారైనట్లు సమాచారం! ముఖ్యంగా ఈ సినిమా కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఉంటుందని ప్రకటించినా.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కృష్ణవంశీ స్థానంలో తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ తెరపైకి వచ్చాడు. బాలయ్య కూడా […]
జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ
సొంత రాష్ట్రం ఏర్పడినా.. ఇంకా ప్రధానప్రతిపక్షమైన వైసీపీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై అటు ప్రజలు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నూతన కార్యాలయ భవనానికి సైలెంట్‌గా శంకుస్థాపన జరిగిపోయిందని.. పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం భూమి ఇవ్వడంపై ఎదురుచూస్తున్నామని చెప్పిన జగన్‌కు.. ఇంత సడన్‌గా భూమి ఎక్కడ దొరికిందనేది ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ భూమి ప్రిన్స్ మహేశ్‌బాబు బంధువు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చెందినదిగా తెలుస్తోంది. తనకు చెందిన […]