దర్శకరత్న దాసరి నారాయణరావు హఠాన్మరణం ఇండస్ట్రీలో చాలామందికి షాక్ ఇస్తోంది. దాసరి లైఫ్ ఇచ్చి ఈ రోజు టాప్ పొజిషన్‌లో ఉన్న చాలా మంది ఆయన శిష్యగణం దాసరి మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. దాసరి మృతి తర్వాత ఆయనకు సంబంధించిన పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దాసరి అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే ఆయన పెద్ద కోడలు సుశీల ఆయన మృతిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇక ఆస్తి పంపకాలపై కూడా ఆమె నానా రచ్చ రచ్చ […]
Author: admin
వైసీపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి..!
ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్టే కనపడుతోంది. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరు ఆ తర్వాత ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కొద్ది రోజులుగా చిరు కాంగ్రెస్ కార్యకలాపాలకు పూర్తిగా దూరమైపోయారు. ఇటీవల కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిర్వహించిన సభకు రాహుల్‌గాంధీతో పాటు జాతీయస్థాయి నాయకులు సైతం హాజరయ్యారు. జాతీయస్థాయిలో వివిధ […]
తీవ్ర అసంతృప్తితో వరంగల్ తూర్పు రాజకీయం
వరంగల్ తూర్పు నియోజకవర్గ టీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌లో సరైన ప్రాధాన్యం లేదని బావిస్తోన్న ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లోకి వెళతారని వార్తలు వస్తుండగా నియోజకవర్గంలోను సురేఖ దంపతులపై అధికార పార్టీలోనే అసంతృప్తి భగ్గుమంటోంది. నియోజకవర్గంలో చాలా మంది కార్పొరేటర్లు సురేఖ భర్త మురళీ తీరుపై లోలోన రగిలిపోతున్నారు. మురళీకి తెలియకుండా ఎవరది అయినా కార్పొరేటర్ పేరు పేపర్లో వచ్చినా అంతే సంగతులట. కొండా మురళికి తెలియకుండా మీటింగ్‌లు పెట్టడానికి కూడా వీల్లేదని ఆదేశాలు […]
చంద్రబాబుకు తలనొప్పిగా ఫోన్ కాల్స్
ఏపీ సీఎం చంద్రబాబుకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరుంది. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో బాబు ఆలోచనలు కాస్త కొత్తగానే ఉంటాయి. వాటిల్లో ఎన్ని సక్సెస్ అయినా, ఎన్ని ఫెయిల్ అయినా బాబు ఆలోచనలు మాత్రం కొత్తగానే ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 1100 కాల్ సెంటర్ ప్రవేశపెట్టింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక…… అవినీతి అంతానికి 1100 కాల్ సెంటర్ అంటూ ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎక్కడ […]
చిరు 151-154 సినిమాలు ఫిక్స్
మెగాస్టార్ చిరు రాజకీయాల్లో సైలెంట్ అయ్యి సినిమాల్లో గేర్ మార్చేశాడు. పదేళ్ల గ్యాప్ తర్వాత తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో బాక్సాఫీస్ లెక్కలు సరిచేసిన చిరు ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. చిరు 151వ సినిమాగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు స్టైలీష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. […]
గ్రూప్ -2 పరీక్షల్లో నిజామాబాద్ హవా…. ఎంపీ కవితపై లుకలుకలు
తెలంగాణ గ్రూప్-ఈ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లా అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఇంటర్వ్యూలకు ఎంపిక కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పరీక్షరాసిన అభ్యర్థులు ఇప్పటికే పలు ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా తాజాగా ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. గ్రూప్-2 పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యర్థులే ఎక్కువుగా ఎంపిక కావడంపై తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో […]
అక్కినేని – దాసరి గ్యాప్ రివీల్ చేసిన మోహన్‌బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావుకు వీరాభిమాని ఎవరంటే ఆయన చెప్పే ఆన్సర్ అక్కినేని నాగేశ్వరరావు. దాసరి ఎంతోమందితో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టినా ఆయనకు వన్ అండ్ ఓన్లీ వీరాభిమాని నాగేశ్వరరావే. వారిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన మేఘసందేశం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లోనే టాప్ సినిమా. ఏఎన్నార్ తర్వాత ఆయన తనయుడు నాగార్జునతోను మజ్ను లాంటి విషాదాంత ప్రేమకథ తీసి హిట్‌కొట్టాడు దాసరి. అలాంటి అక్కినేని – దాసరి మధ్య ఆ […]
రాజీనామా చేయాలని జయదేవ్‌కు బాబు వార్నింగ్
గుంటూరు ఎంపీ, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు బావ గల్లా జయదేవ్‌పై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జయదేవ్‌కు చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం వెనక ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ వివాదమే కారణంగా కనిపిస్తోంది. ఏపీ ఒలంపిక్ సంఘం అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం గల్లా జయదేవ్, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేశ్ మధ్య తీవ్రస్థాయిలో ఫైటింగ్ జరిగింది. గత రెండేళ్లుగా వీరు ఏపీ ఒలంపిక్ సంఘం తమదంటే తమదే […]
పవన్ మెయిన్ కాన్‌సంట్రేషన్ మొత్తం ఆ జిల్లాల పైనే!
2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా కనిపిస్తోంది. పవన్ ఏపీకి చెందిన వాడు కావడంతో పాటు పవన్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జనసేన 2019 ఎన్నికల్లో ఎంత వరకు ఇక్కడ ప్రభావం చూపుతుందన్న అంచనాలు అందరిలోను నెలకొన్నాయి. పవన్ ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి […]