బాబుకు కొడాలి చాలు..టీడీపీని లేపుతున్నారు!

టి‌డి‌పి అధినేత చంద్రబాబుని బూతులు తిట్టే నాయకులు ఎవరంటే..కొడాలి నాని పేరు ఠక్కున చెప్పవచ్చు. అసలు కొడాలి నాని తిట్టినట్లు చంద్రబాబుని మరెవరూ తిట్టరనే చెప్పాలి. ఈయన టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి బాబుని గట్టిగా టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దారుణంగా తిడుతున్నారు. అయితే కొడాలి ఇలా తిడుతూ..బాబు ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు ఉన్నారు. అలాగే జగన్ వద్ద మార్కులు కొట్టేసే అంశంలో బాగా యూజ్ అవుతుందని బాబుని […]

వెల్లంపల్లికి హ్యాండ్..వైసీపీలోకి కొత్త నేత ఎంట్రీ?

విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కొత్త ట్విస్ట్ వచ్చింది..అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా ఉండే ఆకుల శ్రీనివాస్‌ని జగన్ వైసీపేలో చేర్చుకున్నారు. దీంతో వెస్ట్ సీటులో గాని ట్విస్ట్ లు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో వెల్లంపల్లి సీటుకు ఎసరు పెడతారనే చర్చలు నడుస్తున్నాయి. ప్రజారాజ్యంలో రాజకీయ జీవితం మొదలుపెట్టిన వెల్లంపల్లి..2009లో వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం..కాంగ్రెస్ లో విలీనమైంది. దీంతో కొన్ని రోజులు కాంగ్రెస్ […]

బీజేపీలో వెయిటింగ్ లిస్ట్..బాబు ఆఫర్ కోసమేనా?

ఏపీ బీజేపీకి వరుస షాకులు తగలనున్నాయి. టి‌డి‌పితో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం వల్ల బి‌జే‌పిని వీడటానికి నేతలు రెడీగా ఉన్నారంటే? ప్రస్తుతం పరిస్తితి చూస్తే అలాగే కనిపిస్తుంది. మామూలుగా ఏపీ లో బి‌జే‌పికి ఏ మాత్రం బలం లేని సంగతి తెలిసిందే. ఆ పార్టీకి ఒకశాతం ఓటు బ్యాంక్ కనిపించడం లేదు. పైగా గత ఎన్నికల్లో బి‌జే‌పి నుంచి పోటీ చేసిన వారంతా డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటికీ అదే పరిస్తితి ఉంది. అయితే టి‌డి‌పితో పొత్తు ఉంటుందేమో..అప్పుడు […]

ధర్మవరం-రాప్తాడు ఎమ్మెల్యేలకు చెక్..పరిటాలకు సాధ్యమేనా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలు టి‌డి‌పికి కంచుకోటలు. గతంలో ఇక్కడ టి‌డి‌పి హవా నడిచింది. అందులోనూ పరిటాల ఫ్యామిలీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ రెండు చోట్ల టి‌డి‌పి ఓటమి పాలైంది. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ పోటీ చేసి ఓడిపోయారు. అటు ధర్మవరంలో వరదాపురం సూరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే సూరి ఓడిపోయాక టి‌డి‌పిని వదిలి బి‌జే‌పిలోకి వెళ్లారు. దీంతో రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు పరిటాల ఫ్యామిలీకి అప్పగించారు. […]

ఉదయగిరి టీడీపీలో ట్విస్ట్..బొల్లినేనికి ఛాన్స్ ఉందా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరాదు అనే చెప్పాలి. అసలు జిల్లాలో టి‌డి‌పికి పట్టు తక్కువ. రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉండటంతో జిల్లాలో వైసీపీ హవా ఎక్కువ ఉంటుంది. అలా వైసీపీ హవా ఉన్న నియోజకవర్గాల్లో ఉదయగిరి కూడా ఒకటి. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ హవా నడుస్తూ వస్తుంది. అసలు ఇక్కడ టి‌డి‌పి గెలిచింది కేవలం రెండు సార్లు మాత్రమే..1999, 2014 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. 2012 […]

కన్నాతో టీడీపీకి ప్లస్సేనా..రాయపాటి సైడ్ అవుతారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంతవరకు టి‌డి‌పిలో కమ్మ వర్గం ప్రభావం ఎక్కువనే చెప్పాలి..జిల్లాలో దాదాపు సగం పైనే సీట్లు కమ్మ నేతల చేతుల్లో ఉంటాయి. మిగిలిన సీట్లలో ఎస్సీ, ఇతర కులాల వారు ఉంటారు. అయితే అక్కడ టి‌డి‌పిలో కాపు నేతలు పెద్దగా లేరు. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేరికతో కాపు వర్గంలో కూడా నాయకుడు వచ్చినట్లు అయింది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన కన్నా..పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. […]

బొజ్జల వారసుడుకు ఇంకా పట్టు దొరకలేదా?

ఉమ్మడి చిత్తూరు జిల్లా రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. అలా రెడ్డి వర్గం ప్రభావం ఉన్నా సరే టి‌డి‌పి హవా నడిచే స్థానాల్లో శ్రీకాళహస్తి ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ మొదట నుంచి టి‌డి‌పి హవా నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆరుసార్లు గెలిచింది. 1983 నుంచి 2019 వరకు 9 సార్లు ఎన్నికలు జరిగితే టి‌డి‌పి 6 సార్లు గెలిచింది. అంటే కాళహస్తిలో టి‌డి‌పి బలం ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. […]

మంత్రివర్గంలో మార్పులు..మంత్రి రాజీనామా..?

ఏపీ మంత్రివర్గంలో మరొకసారి మార్పులు జరగనున్నాయా? జగన్ ముగ్గురు, నలుగురు మంత్రులని పక్కన పెట్టి..ఎమ్మెల్సీలని మంత్రివర్గంలో తీసుకుంటారా? అంటే ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలని బట్టి చూస్తే కాస్త అవుననే అనిపిస్తుంది. కానీ ఎన్నికలకు ఇంకా 15 నెలలు మాత్రమే సమయం ఉంది..అలాంటప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేయడంలో ఒరిగేది ఏమి లేదు. కాకపోతే ఎమ్మెల్సీలకు కూడా అవకాశం ఇచ్చామని చెప్పుకోవడానికి ఉంటుంది. కాకపోతే మొదట్లోనే మండలి రద్దు అని చెప్పి..ఎమ్మెల్సీ కోటాలో మంత్రులైన పిల్లి సుభాష్, […]

సీటుపై ఆలీ ఆశ..జగన్ క్లారిటీ ఇస్తారా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని చెప్పి సినీ నటుడు ఆలీ ఆశపడుతున్నారు. జగన్ ఏదొక సీటు ఇవ్వకపోతారా అని చూస్తున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనే తపన కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్న పోటీలో ఆలీకి సీటు దక్కడం, సీటు దక్కిన గెలవడం అంత ఈజీనా అంటే చెప్పడం కష్టమే. మొదట పార్టీలో సీటు దక్కడం కష్టమైన పని. కానీ జగన్ అనుకుంటే సీటు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే ఆలీ..కొన్ని సీట్లపై ఆశలు పెట్టుకున్నారని తెలిసింది. […]