భూమా ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ.!

రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీలపై పోరు మాత్రమే కాదు..సొంత పార్టీల్లో కూడా అంతర్గత పోరు ఉంటుంది. సొంత పార్టీ నేతలే ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి చూస్తారు. ఇప్పటికే అధికార వైసీపీలో అంతర్గత పోరు పీక్స్ లో ఉంది. చాలా నియోజకవర్గాల్లో నేతలకు పడటం లేదు. ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య రచ్చ నడుస్తోంది. ఈ రచ్చ టీడీపీలో కూడా ఉంది. ఇక ఈ సీటు రచ్చ భూమా ఫ్యామిలీలో రాజకీయ చిచ్చుకు కారణమైంది. కర్నూలు జిల్లాలో భూమా […]

ఎన్టీఆర్ టూ వైఎస్సార్..ఒరిగేది ఏంటి?

ఏదేమైనా సంచనల నిర్ణయాలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వానికి  సాటి లేదనే పరిస్తితి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకొస్తారో ఎవరికి అర్ధం కాదు. ఇక ఆ నిర్ణయాలు ఒకోసారి బాగానే ఉంటాయి..ఒకోసారి మాత్రం వివాదాస్పదం అవుతాయి. ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయం లాంటిది. ఇలాంటి సంచలన నిర్ణయాలు జగన్ చాలానే తీసుకున్నారు. తాజాగా కూడా జగన్ ఊహించని నిర్ణయం ఒకటి తీసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని..వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేశారు. […]

బుచ్చయ్యకు ‘జనసేన’ గండం..!

గత ఎన్నికల్లో దాదాపు 50 వరకు నియోజకవర్గాల్లో ఓట్లు చీల్చి టీడీపీ ఓటమికి జనసేన కారణమైన విషయం తెలిసిందే. జనసేన గెలవలేదు..అలాగే టీడీపీని గెలవలేదు. వెరసి వైసీపీకి బెనిఫిట్ అయింది. వైసీపీ భారీ స్థాయిలో 151 సీట్లు గెలుచుకోవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. అయితే ఇప్పటికీ జనసేన వల్ల టీడీపీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా విడివిడిగా పోటీ చేస్తే దాదాపు […]

సరికొత్త సర్వే: టీడీపీ-జనసేన కలిస్తే..!

ఇటీవల ఏపీలో సర్వేల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే..ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఏపీలో మాత్రం ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు నెక్స్ట్ గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ఇదే క్రమంలో గెలుపోటములపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే శ్రీ ఆత్మసాక్షి సర్వే బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో అన్నీ పార్టీలు విడిగా పోటీ చేస్తే టీడీపీకి 95, వైసీపీకి 75, జనసేనకు 5 సీట్లు వస్తాయని తేలింది. అయితే ఇటీవల వచ్చిన […]

అయ్యన్నని మళ్ళీ నిలువరించడం కష్టమే..!

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు..అలాగే ఎల్లకాలం ఒకరికే అధికారం ఉండదు..ఇక గెలిచిన వాళ్లే మళ్ళీ గెలవరు…ఓడిన వారు జీవితాంతం ఓడిపోతూ ఉండరు. కాబట్టి రాజకీయం ఎప్పుడు ఎలాయిన మారిపోవచ్చు. ప్రస్తుతం ఏపీలో రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది..2019 ఎన్నికల నుంచి ఏపీలో అన్నీ వైసీపీకి అనుకూలంగానే నడుస్తూ వచ్చాయి. గెలిచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయం వైసీపీకి అనుకూలంగానే ఉంది. ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే అనే పరిస్తితి..ఒకవేళ పరిస్తితులు అనుకూలంగా లేకపోయినా అధికార బలంతో అనుకూలంగా […]

ఉత్తరాంధ్ర మంత్రులకు తిరుగులేనట్లే..!

ఏపీలో అధికార వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని పలు కథనాలు, సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 50 మందిపైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, నెక్స్ట్ ఎన్నికల్లో వారికి గెలవడం కష్టమని సర్వేలు వస్తున్నాయి. అలాగే వీరిలో కొందరు మంత్రులపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేల్లో తేలింది. కానీ ఏ మంత్రి పరిస్తితి ఎలా ఉన్నా సరే ఉత్తరాంధ్రలోని మంత్రులకు తిరుగులేదని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులకు మళ్ళీ అవకాశాలు పుష్కలంగా […]

కోలగట్ల వారసురాలు రెడీ..?

విజయనగరం అంటే అశోక్ గజపతి రాజు కంచుకోట అని అందరికీ గుర్తొస్తుంది. విజయనగరం అసెంబ్లీలో అశోక్ గజపతి రాజుకు తిరుగులేదనే సంగతి తెలిసిందే. 1978 నుంచి అశోక్ అక్కడ తిరుగులేని విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ 2004 ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ లో సీటు రాకపోవడంతో కోలగట్ల వీరభద్రస్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేసి..కేవలం 1126 ఓట్ల తేడాతో అశోక్‌పై గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2009లో కోలగట్ల కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అశోక్‌పై ఓడిపోయారు. […]

పల్నాడు ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్..!

కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు టెన్షన్ మొదలైందా? అంటే పల్నాడులోని ఎమ్మెల్యేలకు సీటు గురించి దిగులు బాగా పట్టుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు సీటు విషయంలో డౌట్ కూడా ఉందట. ఇప్పటికే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని జగన్ తేల్చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో పల్నాడు జిల్లాలో సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల లిస్ట్ బాగానే ఉందట. దీంతో వారికి సీటు డౌటే అని తెలుస్తోంది..పైగా నియోజకవర్గాల్లో ఆధిపత్య […]

జగన్‌కు ‘ఈనాడు’ కౌంటర్లు..!

రాష్ట్రంలో మీడియా సంస్థలు గాని, పత్రిక సంస్థలు గాని..రాజకీయ పార్టీలకు అనుకూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలకు బాకా ఊదే సొంత మీడియా సంస్థలు ఎక్కువ అయిపోయాయి. అధికార వైసీపీకి సొంత మీడియా సంస్థతో పాటు..అనుకూల మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి…వీటిని బ్లూ మీడియా అని టీడీపీ విమర్శిస్తుంటుంది. అటు టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటిని యెల్లో మీడియా అని వైసీపీ విమర్శిస్తుంటుంది. పైగా ఆ చానల్స్ ఏవో, పత్రికలు ఏవో జగన్‌తో […]