అనుష్కతో పోలిస్తే నాకు ఆనందమే.. ఆషిక రంగనాథన్ కామెంట్స్ వైరల్..

నా సామి రంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్. నవ మన్మధుడు నాగార్జున హీరోగా.. విజయ బిన్నీ దర్శకత్వంలో సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ నాగార్జునలాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయి వరాలు పాత్రలో కనిపించబోతున్నా అంటూ వివరించింది. తను ఫ్రీ డెసిషన్స్ మేకింగ్ చేసే ఓ అమ్మాయిగా తెలుస్తోంది.

సాధారణంగా గ్రామీణ నేపథ్య సినిమాలలో హీరోయిన్ సాఫ్ట్ రోల్స్ తో కనిపిస్తూ ఉంటారు. కానీ వరాలు అలాంటి అమ్మాయి కాదు. తను ఎదురు చెప్పే నేచర్ కలిగిన అమ్మాయి. ధికార స్వ‌భావి. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని చాలామంది భావిస్తారు. స్టోరీ పరంగా నాగార్జున గారికి నాకు మధ్య మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కన్నడ, తెలుగు సాంప్రదాయాలు ఒకేలా అనిపిస్తాయి. అందుకే ఇక్కడ ఇండస్ట్రీ చాలా సౌకర్యంగా ఉంటుంది అంటూ వివరించింది.

ఇక టాలీవుడ్ యాక్టర్స్ లో సీనియర్ యాక్టర్ అనుష్క అంటే నాకు చాలా ఇష్టం అంటూ చెప్పిన ఆమె.. కొందరు జూనియర్ అనుష్క అని పిలుస్తూ ఉంటారని.. అలాంటి గొప్పనాటితో పోల్చడం నాకు ఆనందమే అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. గ్లామర్ తో పాటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేయాలని భావిస్తున్నా. అలాగే పీరియాడికల్ ఫిలిమ్స్ చేయాలని కూడా ఉంది. ఏదో ఒక రోజు రాజమౌళి గారి సినిమాలో నటించాలని బలంగా కోరుకుంటున్నా అంటూ వివరించింది.