చిరంజీవి, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిపడేసిన వెంకి మామ…!

తాజాగా వెంకటేష్ నటిస్తున్న కెరీర్ 75వ మూవీ ” సైంధవ్”. శైలేశ్ కొలను ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో రూపొందింది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాదులో ఎంతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబంధం పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే వెంకటేష్ మాట్లాడుతూ.. ” అభిమానుల సమక్షంలో సైంధవ్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మా సినిమా సంక్రాంతి పండగగా మీ ముందుకి రానుంది.

ఎప్పటిలాగే మీ ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నాం. ఇలాంటి కథలో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నా. అలాగే ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా. అలాగే చిరంజీవి, నేను కలిసి త్వరలోనే నటిస్తాము ” అంటూ చెప్పుకొచ్చాడు వెంకి. ప్రస్తుతం వెంకటేష్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.