” ఎన్టీఆర్ ఆ సినిమాకు బలవంతంగా ట్యూన్స్ కాపీ చేయించారు “.. మణిశర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోల సినిమాలుకు బెస్ట్ చాయిస్ అంటే మణిశర్మ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మణిశర్మ అవకాశాలు కోసం వెతుక్కుంటున్నారు. మన టాలీవుడ్లోకి కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావడంతో మణిశర్మ పేరే మర్చిపోయారు డైరెక్టర్లు. ఇక తాజాగా మణిశర్మ తన ఆవేదనను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

స్టార్ హీరోలు.. ఎప్పుడు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో కాకుండా మిగతా వారికి కూడా ఛాన్స్ ఇస్తూ ప్రేక్షకులకు కూడా చేంజ్ ఉన్నట్లు ఉంటుంది కదా అని చెప్పుకొచ్చారు. దేవి శ్రీ కి ఒకటి, థమన్ కు ఒకటి అలాగే మాకు ఒకటి.. ఇలా ఇస్తూ ప్రేక్షకులకు డిఫరెంట్ మ్యూజిక్ అందించండి అంటూ మణిశర్మ అభిప్రాయపడ్డాడు. ఇక అంతే కాకుండా మణిశర్మ ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.

ముఖ్యంగా కాపీ ట్యూన్స్ మీరు కూడా చేశారా? అనే ప్రశ్నకు మణిశర్మ చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రశ్నకు మణిశర్మ స్పందిస్తూ…” నన్ను ఫోర్స్ చేశారు. రెండు, మూడుసార్లు బలవంతంగా కాపీ ట్యూన్స్ చేపించారు. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలోని చిక్ చిక్ బం ఒం సాంగ్ కాపీ చేశాను. నాకు ఇష్టం లేకున్నా చేశాను. కాపీ చేయడం ఏ కంపోజర్ కు ఇష్టం ఉండదు. అంటారు కానీ.. ఒరిజినల్ చేయాలని అందరూ కోరుకుంటారు. కొన్ని కొన్ని సార్లు బలవంతంగా జరుగుతూ ఉంటాయి ” అంటూ చెప్పుకొచ్చాడు మణిశర్మ. ప్రస్తుతం ఈయ‌న‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.