నందమూరి బాలకృష్ణ హీరోగా.. బాబీ దర్శకత్వంలో ఓ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కనుంది. ప్రధానంగా తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కే ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్ పై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తుంది.
ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య.. బాలయ్య కొడుకు పాత్రల మధ్య ఎమోషన్స్ చాలా బాగుంటాయని.. ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వెరీ ఎమోషనల్ గా ఉంటుందని.. అలాగే ఈ సినిమా కథ ముగింపు కూడా చాలా ఇంట్రెస్టింగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాలోని యాక్షన్ విజువల్స్ కూడా వండర్ ఫుల్ గా ఉంటాయట. ముఖ్యంగా బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా త్రిలింగ ఉండనున్నాయట. అలానే ఈ సినిమా బాలయ్య టైపు మాస్ యాక్షన్ సినిమా కాదని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.