పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా? ఈమె ఓ స్టార్ హీరోయిన్. అనేక సినిమాలు చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది కూడా. ఇక ఈమె ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళ్ లో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఒక సినిమాలో రజిని కూతురుగా నటించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె మరెవ్వరో కాదు.. నివేదా థామస్.
ఈ ముద్దుగుమ్మ ఒక గ్లామర్ పరంగానే కాదు.. అభినయం విషయంలో కూడా ఈమె ప్రేక్షకులని ఆకట్టుకుంది. నాని హీరోగా నటించిన ” జెంటిల్ మెన్ ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె… అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక ఆ తరువాత నాని సరసన నిన్ను కోరి అనే సినిమాలో నటించి సక్సెస్ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఇలా అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోను చూసిన కొంతమంది మాత్రమే ఈమె నివేదా థామస్ అని గుర్తు పడుతున్నారు. మరి కొంతమంది మాత్రం అస్సలు గుర్తుపట్టలేకపోతున్నారు.