” బిగ్ బాస్ 7 ” లో నయని పావని ఎలిమినేట్… అలా జరగడం ఇదే ఫస్ట్ టైం…!!

బిగ్ బాస్ షోలో ప్రతివారం ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. కానీ గత ఐదు వారాల కంటే ఈసారి భిన్నంగా సాగింది. ఎవ‌రు అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అలానే దామిని, రతిక, శుభశ్రీ రియంట్రి విషయంలో నాగ్ సరికొత్త ట్విస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దామిని, రతిక, శుభశ్రీ ల‌లో ఒకరికి ఛాన్స్ ఉందని శనివారం ఎపిసోడ్లో చెప్పిన నాగార్జున.. వాళ్ల కోసం ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా అందరూ ఓ పేపర్ మీద రాసి బాక్స్‌లో వేశారు. అయితే వేళల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి హౌస్ లోకి రీయంట్రీ ఇస్తారని చెప్పాడు నాగార్జున.

అది ఎవరనేది వచ్చే శనివారం చెబుతాన‌ని అన్నాడు. ఆదివారం ఎపిసోడ్ అంటే సందడి ఉంటుంది. అందుకు తగ్గట్లు ఈ వారం ” భగవంత్ కేసరి ” టీం నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీ లీల వచ్చారు. కాసేపు హౌస్ మేట్స్ అందరితో డ్యాన్సులు వేయించి మాట్లాడి తన సినిమాని ప్రమోట్ చేసి వెళ్ళిపోయారు. ఇక ఎలిమినేషన్ లో భాగంగా తేజ, యావర్ తొలి రౌండ్ లో సేఫ్ అయ్యారు. రెండో రౌండ్లో అమర్దీప్, శోభా శెట్టి సేఫ్ అయ్యారు. మూడో రౌండ్లో పూజ మూర్తి సేఫ్ అయింది. చివరగా అశ్విని, నయని మిగలగా.. వీళ్ళిద్దరిలో అనూహ్యంగా నయని ఎలిమినేట్ అయిపోయింది. అయితే వచ్చిన వారంలోనే ఎలిమినేట్ అయిపోవడంపై నయని కి షాక్‌ తగిలింది.

బాగా ఆడాను కానీ ఎలిమినేట్ అయిపోయానని గట్టిగా ఏడ్చేసింది. బాగా ఆడకుండా ఎలిమినేట్ అయితే ఒప్పుకుంటానని ఏడుస్తూ చెప్పింది. ఏం ఆడలేదని పంపించేస్తున్నారు అని ఏడుస్తూనే బిగ్ బాస్ ని ప్రశ్నించింది. ఇక నయని హౌస్ లో నుంచి వెళ్లిపోయిన తర్వాత స్టేజ్ పై నుంచుని హౌస్ లో అందరితో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు ఏడుస్తూనే ఉన్నారు. ఇన్నేళలో ఇలా ఓ కంటిస్టెంట్ కోసం అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అని స్వయంగా నాగార్జున అన్నాడు. ఇంతమంది మనసు గెలుచుకున్న ఈ అమ్మాయి జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని నాగ్ ఆశీర్వదించాడు.