టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా ‘ భోళా శంకర్ ‘ ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చి ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇతర భాషల సినిమాకు రీమేక్ కావడం వల్ల అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు.. మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటించిన ఈ సినిమాకి కంటెంట్ టేకింగ్ బాగోకపోవడమే ఫ్లాప్ అవ్వడానికి కారణం అంటు పలు కామెంట్స్ వినిపించాయి.
ఇక ఈ సినిమాతో ఫ్లాప్ చెవి చూసిన చిరంజీవి స్ట్రైట్ సినిమాల్లో మాత్రమే నటించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ లైన్ లో చిరుకి సంబందించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే మెగాస్టార్ తో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎ ఆర్ మురుగదాస్ పవర్ఫుల్ ఎమోషనల్ డ్రామాగా ‘ స్టాలిన్ ‘ సినిమాలో తర్కెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సస్ సాదించలేక పోయింది.
ఇక వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందంటూ ఫ్రెష్ రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమానా అనే టెన్షన్ ఫాన్స్ లో మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మురుగుదాస్ కోలీవుడ్ ‘ దర్బార్ ‘ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని కొత్త సినిమా చేయబోతున్నాడు. మరి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందా లేదా వేచి చూడాలి.