పవన్ చేసిన తప్పుకు క్షమాపణ కోరిన చిరంజీవి.. ఏం జరిగిందంటే..?

కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు కూడా తమ కుటుంబం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సమస్య వచ్చినప్పుడు ముందు ఉండడానికి కూడా వెనుకాడరు. ఇక అలాంటి వారిలో మెగా ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి కష్టం వస్తేనే తట్టుకోలేని చిరంజీవి.. అలాంటిది ప్రాణానికి ప్రాణమైన తన తమ్ముళ్లకు కష్టం వస్తే తట్టుకోగలరా..? ఎంత పరిస్థితులనైనా ఎదుర్కొని వారికి అండగా నిలుస్తారు అని చెప్పడంలో ఇప్పుడు చెప్పబోయే ఒక విషయమే అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ చేసిన ఒక తప్పుకు చిరంజీవి క్షమాపణ కోరారట.. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.Mega154: Pawan Kalyan To Play Chiranjeevi's Brother? - Movie News

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలు పడి అవకాశాలను సంపాదించుకొని .. నేడు మెగాస్టార్ హీరోగా ఎదిగారు . ఇక అలా ఎదిగిన చిరు ఆ తర్వాత తన తమ్ముళ్లు అయిన నాగబాబు, పవన్ కళ్యాణ్ లను కూడా అదే రంగంలో రాణించేలా చేశారు. ఇక ఈ క్రమంలోని చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలోని కొనసాగుతోంది.. చిరంజీవి హీరోగా కొనసాగిస్తున్న కొత్తలో చెన్నై పరిసర ప్రాంతాలలో షూటింగ్ లొకేషన్స్ ఉండడం వల్ల అక్కడే ఎక్కువగా సినిమా షూటింగ్ లు చేసేవారు. ఇక ఈ క్రమంలోని ఒకసారి డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాను చెన్నై పరిసర ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించారు.

ఇక అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది గూండాలు, ఆకతీయులు షూటింగ్ వద్ద చాలా అల్లర్లు చేశారట. ఇక మరి కొంతమంది ఏకంగా చిరంజీవిని బూతులు కూడా తిట్టారట. అయితే ఈ విషయాన్ని ఆయన పెద్దగా పట్టించుకోకపోయినా ..చిరంజీవి డ్రైవర్ మాత్రం పవన్ కళ్యాణ్ కు ఈ విషయాన్ని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ మరుసటి రోజు షూటింగ్ వద్దకు వచ్చి వారందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. కానీ వారు వినకపోవడంతో గొడవకు దిగిన పవన్ కళ్యాణ్.. కోపంతో ఒకరిని బాగా చితక్కొట్టారట. ఇక భారీగా గాయాలపాలై ఆసుపత్రి పాలైన అతడి గురించి.. విషయం వెలుసుకున్న చిరంజీవి హుటాహుటిన వెళ్లి తన తమ్ముడు చేసిన పనికి క్షమాపణలు చెప్పి.. అవసరాలకు, వైద్య ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చారట. ఇక అలా పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు చిరంజీవి క్షమాపణలు కోరారు.