సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ మరణం..!!

ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అనే తేడా లేకుండా సినీ ప్రముఖులు మరణిస్తున్నారు. శాండిల్వుడ్ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణపు విషాదఛాయలు ఇంకా తొలగి పోకనే ఇప్పుడు ప్రముఖ నృత్య దర్శకుడు కూల్ జయంత్ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 44 సంవత్సరాలు.. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని వెస్ట్ మాంబళం లో తన నివాసంలో బుధవారం ఉదయం కన్నుమూశారు.

డాన్సర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈయన, కొరియోగ్రాఫర్ గా ఎదిగారు . అంతేకాదు ప్రభుదేవా, రాజు సుందరం మాస్టర్ లతో డాన్స్ ట్రూప్ లో పని చేశాడు. సుమారుగా ఎనిమిది వందల చిత్రాల్లో డాన్సర్ గా పనిచేసిన ఈయన ,కాదల్ దేశం సినిమా ద్వారా కొరియోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. మలయాళం, తమిళ భాషల్లో సుమారు 100 చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసిన ఈయన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి నటుల చిత్రాలకు కూడా డాన్స్ నేర్పించాడు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఈయన ఈ రోజు ఉదయం కన్ను మూశారు. పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఈయన మరణానికి సంతాపం తెలుపుతున్నారు.