వెంకీ ” సైంధవ్ ” ట్రైలర్ పై చెర్రీ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ తాజాగా నటిస్తున్న కెరీర్ 75వ సినిమా ” సైంధవ్”. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అలాగే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఇప్పటివరకు సైంధవ్ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ హైబ్స్ నెలకొల్పాయి.

ఇక ఈ సినిమా తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో తెరకెక్కనుంది. ఇక ఈ మూవీ ట్రైలర్ను నిన్న విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ చూసిన రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” యాక్షన్ ప్యాక్డ్, ఎమోషనల్ డ్రామాల ట్రైలర్ ఉంది.

నాకు ఇష్టమైన నటుడు వెంకటేష్ లో కనిపించింది. ఆయన 75వ సినిమాకి నా శుభాకాంక్షలు. సినిమా విడుదల కోసం జనవరి 13 వరకు ఎదురు చూడలేకపోతున్నా ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కోసం వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.