పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల ” సలార్ ” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతటి విజయాన్ని దక్కించుకున్నాడో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.
డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ఇన్ దక్కించుకుంది. అంతేకాకుండా కలెక్షన్స్ భారీగా రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ మారుతీ తో ఓ సినిమా, కల్కి వంటి సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు.
ఇక తాజాగా డార్లింగ్ తన ఫ్యాన్స్ కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. తన ఇన్స్టాలో…” నేను ఖాన్సార్ భవిష్యత్తును రాస్తాను.. మీరంతా నా వెనుక కూర్చోండి. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ” అంటూ పవర్ఫుల్ లుక్ తో దర్శనమిచ్చాడు డార్లింగ్. ప్రస్తుతం ఈయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram