సినిమా సెలబ్రిటీలు లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇవి సామాన్యులకు విచిత్రంగా కనిపించడం కామన్. సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి చెప్పుల వరకు అన్ని కాస్ట్లీ వే వాడుతూ ఉంటారు. అయితే వాళ్లు వేసుకునే కొన్ని కొన్ని వస్తువులను చూస్తే ఇవి అంత ఖరీదా? అనిపిస్తుంది. ఇక తాజాగా హీరో విశ్వక్సేన్ వేసుకున్న చెప్పులు చూస్తే అలానే అనిపించింది ప్రేక్షకులకి.
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం చేస్తున్న మూవీ ” బబుల్ గమ్ “. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి విశ్వక్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హబీబి అనే పాటకు డాన్స్ చేయాలని యాంకర్ సుమ కోరింది. అయితే తాను చేయనని తన చెప్పులను చూపించాడు విశ్వక్. వాటిని చూసి ఆశ్చర్యపోయింది సుమ.
” ఏంటివి షూసేనా?.. బాబు.. ఎక్కడ దొరికాయి ” అంటూ సుమ కామెంట్స్ చేసింది. ఇక దీంతో ఈ చెప్పుల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఈ చెప్పుల బ్రాండ్ బలెన్సియాగ. ఇది 104 ఏళ్ల క్రితం స్పెయిన్ లో పుట్టిన లగ్జరీ బ్రాండ్. ఇది ఫ్రంచ్ కంపెనీ కానీ.. తయారయ్యేది మాత్రం చైనాలో. ఒక పెయిర్ బలెన్నియాగ హార్ట్క్రాన్స్ ధర 1190 అమెరికన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో అక్షరాల రూ. 98,975. ఇక ఈయన షూస్ విలువ తెలుసుకున్న ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.