” గుంటూరు కారం ” ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్… ఇక పూనకాలే…!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన తండ్రి పేరును ఇండస్ట్రీలో వాడుకుని పైకి రాకుండా.. తన సొంత టాలెంట్ తో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడు మహేష్. ఇక తాజాగా మహేష్ హీరోగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ భారీ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ లో మొదటి సాంగ్ పర్వాలేదు అనిపించుకున్న.. రెండో సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఫాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.