సాయి ప‌ల్ల‌వి తండ్రి చెప్పిన ఆ మాటే ఇప్ప‌ట‌కీ ఫాలో అవుతోందా..ఆ సీక్రెట్ ఇదే…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తను అందంతో అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి సినిమాల కంటే తన వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానాన్ని దక్కించుకుంది. ముందు నుంచి సాయి పల్లవి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగింది. రెమ్యూనరేషన్ కోసం ఎలాంటి పాత్రలకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వదూ.

ఆమె ఒక సినిమాకు ఓకే చెప్పిందంటే.. అందులో కచ్చితంగా ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అని ప్రేక్షకులు భావించే రేంజ్‌కు ఆమె ఎదిగింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ.. నటించే పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్న సాయి పల్లవి కి ఫ్యాన్ ఫాలోయింగ్ రేట్ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం ఆమె వ్యక్తిత్వమే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ నాకు మొదట నటనపై అసలు ఆసక్తి లేదని.. అయితే ప్రేమమ్‌ సినిమా ఆఫర్ రావడంతో ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చింది.

అప్పుడు మా నాన్న ఒకటే మాట చెప్పారు. జీవితం ఎటువైపు తీసుకెళ్తే అదే మన పని. అయితే ఒకటి గుర్తుంచుకో మనం ఎక్కడ ఉన్నా గౌరవంగా ఉండాలి, గౌరవంగా బ్ర‌తకాలి, గౌరవంగానే వెళ్ళిపోవాలి అంటూ చెప్పుకొచ్చారు. నాకు ఈ మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ అంతా మా చిన్నది గోల్డ్ అంటూ, బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.