చెర్రీ తో సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన రాజ్ కుమార్ హిరాని..!

మన టాలీవుడ్ గ్లోబల్ మెగాస్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ సుపరిచితమే. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం చెర్రీ హీరోగా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ మాసివ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా అనంతరం మరో సినిమాతో లైనప్ ని సెట్ చేసుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత సినిమాలలో బాలీవుడ్ టాప్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాని తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటిపై రాజ్ హిరానినే క్లారిటీ ఇచ్చాడు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయ‌న‌ మాట్లాడుతూ…” రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాను అనే మాటల్లో ఎలాంటి నిజం లేదు. కానీ రామ్ చరణ్ నాకు తెలుసు. చరణ్ తో సినిమా చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వార్త చూసి అభిమానులు.. నిరాశకు గురయ్యారు.