స‌లార్ ట్విట‌ర్ రివ్యు.. ప్ర‌భాస్ సాలిడ్ కమ్‌ బ్యాక్.. ఇక పూన‌కాలే..

బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. కానీ ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క సాలిడ్ హీట్ కూడా లేదు. దీంతో ఈసారి పక్కగా హిట్ కొట్టాలని ఉద్దేశంతో ప్రశాంత్ నీల్‌తో జతకట్టాడు ప్రభాస్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈమూవా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో 21 అర్ధ రాత్రి ఒంటిగంటకు మిడ్ నైట్ షోల‌తో సందడి చేశాడు ప్రభాస్. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట‌ర్‌ ద్వారా తమ అభిప్తాయాని తెలియజేశారు. ప్రభాస్ బాహుబలి తర్వాత హ్యాట్రిక్ ఫెయిల్యూర్‌లు చెవి చూశాడు.

అయితే ఈ సినిమాతో ప్రభాస్ హిట్ కొట్టడం చాలా ముఖ్యం.. దీంతో ఆశలన్నీ ఈ మూవీ పైనే పెట్టుకున్నాడు రెబల్ స్టార్. శృతిహాసన్ హీరోయిన్గా, మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ఈ మూవీపై ట్విట్టర్లో చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి. కే జి ఎఫ్ డైరెక్టర్ ఈ సినిమాతో మరో ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడో లేదో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం పాన్ ఇండియా అంతట సలార్ మానియా గట్టిగానే మారుమోగుతుంది. ఎక్కడ చూసినా సలార్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక మిడ్ నైట్ షో తో సందడి చేసిన ఫ్యాన్స్ ఈ సినిమాతో ప్రభాస్ సాలిడ్ కమ్‌ బ్యాక్ ఇచ్చాడు అంటూ.. కచ్చితంగా ఇండస్ట్రియల్ బ్లాక్ బస్టర్ కొడతాడంటూ రివ్యూస్ ఇస్తున్నారు.

ఇక కన్నడ ఆడియన్స్ మా ప్రశాంత్ నిల్ గట్టిగానే సక్సెస్ సాధించాడు అంటూ చెప్తున్నారు. ఇక రిలీజ్‌కు ముందు నుంచే సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు స‌లార్‌పై చాలా ఆసక్తి చూపించారు. సినిమా చూసిన తర్వాత కూడా వారు అందరిలో అదే హ్యాపీనెస్ కనిపిస్తుంది. టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ఆడియన్స్ తో కలిసి మరి ఎంజాయ్ చేశాడు. విజిల్స్ వేస్తూ గంతులు వేస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్లో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు సల్లరోడి రాంపేజ్ ఎలా ఉందో చెప్పడానికి. ఈ ఏడాది అయిపోతున్న నేపథ్యంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ న్యూ ఇయర్ పార్టీకి రెడీగా ఉన్నాడంటూ ట్విట్ చేస్తున్నారు అభిమానులు.

ఇక చాలామంది సలార్ బ్లాక్ బస్టర్ పక్క అంటూ సింపుల్ రివ్యూ ఇచ్చాడు. ప్రభాస్ పర్ఫామెన్స్ కు దీటుగా పృథ్వీరాజ్ న‌ట‌న‌తో గట్టిపోటి ఇచ్చాడు. ఇక డిపెయిన్ ఇంతకంటే అద్భుతంగా ఎవరూ చూపించలేరు అనే విధంగా ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని సన్నివేశఅలో కనిపిస్తాయి అంటూ ట్విట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక బెంగళూరులో కూడా బ్లాక్ బస్టర్ స‌లార్ అంటూ ట్విట్లు హైలైట్ అవుతున్నాయి. ఇక మిడ్ నైట్ షో తో ఈ రేంజ్‌ సక్సెస్ అందుకున్న ప్రభాస్ ముందు షారుక్ ఢంకీ నిలవడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గతంలో స‌లార్‌ సినిమా పై పలు విమర్శలు చేసిన కన్నడ హీరో సినిమా పరిస్థితి ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది.

మరి కొంతమంది సింపుల్‌గా 1000 కోట్లు లోడింగ్ అంటూ సలార్ ను ట్యాగ్ చేసి ట్విట్‌ షేర్ చేస్తున్నారు. యాక్షన్, సర్ప్రైజ్ ట్విస్టులు.. ప్రశాంత్‌ ని మార్క్ డైరెక్షన్ కు సరిపడా ఉన్నాయి. ఇలా ట్విట్టర్ ఆడియన్స్ మొత్తానికి చాలా పూన‌కాలు తెప్పించిన స‌లార్ ఈ రోజు సినిమా రిలీజ్ అయి కలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయం అనే అభిప్రాయం వినపడుతుంది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు లాంటివాడే పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు అంటే సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకోబోతుందో అర్థమవుతుంది. తెలుగు, కన్నడ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ ఫుల్‌మిల్స్ అని చెప్పవచ్చు.