నాని ” హాయ్ నాన్న ” మొదటి వారం కలెక్షన్స్… హిట్టా? ఫ్లాపా?

నాచురల్ స్టార్ నాని హీరోగా.. ముర్నాల్ ఠాకూర్ హీరోయిన్గా… శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ ఎమోషన్ మూవీ ” హాయ్ నాన్న “. ఈనెల 7న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు కాస్త తడబడ్డ.. ఆ తర్వాత బాక్సాఫీస్ ని షేక్‌ చేసిందని చెప్పాలి. అలాగే ఎంతోమంది ప్రేమ ను దక్కించుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో నటించిన నాని, మృణాల్ ఠాకూర్ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.

ఇక ఈ మూవీలో శృతిహాసన్ సైతం ఓ కీలకమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈమె పాత్ర చిన్నదైనప్పటికీ ప్రాధాన్యం ఎక్కువగా ఉండడంతో మంచి పేరు దక్కింది. ఇక ఈ సినిమా విడుదలై వారం అవ్వడంతో.. ఈ మూవీ కలెక్షన్స్ పై ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.28.50 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.2.65 కోట్ల దూరంలో ఉంది.

ఇక ఇదిలా ఉంటే హాయ్ నాన్న నాన్ దియాత్రికల్ రేట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 15.80 కోట్ల షేర్..రూ.28.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక అలాగే ఓవర్సీస్ లో రూ‌. 7.00 కోట్లు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో రూ. 25.85 కోట్ల మరియు రూ.49.05 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.