అందాల రాక్షసి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన మొదటి సినిమాతోనే నటన ద్వారా పెద్ద ఎత్తున అభిమానులని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనంతరం మంచి అవకాశాలను సైతం దక్కించుకుంది. ఇక ఇలా హీరోయిన్ గా అనేక సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీ అయిపోయింది.
ఇక ఇటీవలే మెగా ఇంటికి కోడలు సైతం అయ్యింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటూ తాజాగా పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక ఇలా తన ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలు అయిన లావణ్య.. తన ఇంటి పేరుని సైతం మార్చుకుంది.
ఇక వీరి పెళ్లి ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సోషల్ మీడియా ఖాతాలలో లావణ్య త్రిపాఠి అని ఉన్నటువంటి ఈమె పేరు పక్కన కొణిదెల పేరును చేర్చుకుంది. ఇక ప్రస్తుతం ఈమె యాడ్ చేసిన పేరును చూసి మెగా అభిమానులు ఫుల్ కుష్ అవుతున్నారు.