కాజల్ కు ఇష్టమైన టాలీవుడ్ హీరో అతనేనా.. అంత స్పెషల్ ఎందుకంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా అదే క్రేజ్‌తో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2009లో వచ్చిన రామ్ చరణ్.. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాతో కాజల్ కెరీర్ యూటర్న్ తిరిగింది. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ, మహేష్, పవన్, చిరంజీవి, బాలయ్య ఇలా టిలీవుడ్ అగ్ర హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది.

మీరు నటించిన మీ కోస్టార్స్ లో ఏ హీరో అంటే ఇష్టం అని ఇంటర్వ్యూవ‌ర్ అడ‌గ‌గా.. ఇలాంటి ప్రశ్నలు అడిగితే టెన్షన్ వచ్చేస్తుంది అంటూనే.. తన ఫేవరెట్ కోస్టార్స్ టాలీవుడ్ లో ఎన్టీఆర్, కోలీవుడ్ లో విజయ్ దళపతి అంటూ సమాధానం ఇచ్చింది. ఇక కాజల్‌ తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అంటూ గతంలో కూడా ప‌లుమార్లు వెల్లడించింది. ఎన్టీఆర్‌తో తను సినిమా చేసేటప్పుడు చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవుతానంటూ చెప్పుకొచ్చింది. కాజల్‌కు సినీ ఇండస్ట్రీలో ఉండే అతి తక్కువ మంది స్నేహితులలో ఎన్టీఆర్ కూడా ఒకడు.
వీరిద్దరి మధ్య ఉన్న ఆ క్లోజ్‌నెస్‌తోనే జనతా గ్యారేజ్ లో స్పెషల్ సాంగ్‌కి కూడా కాజల్ ఒప్పుకుందట‌.

ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పై తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది. కాజల్‌కు ఎన్టీఆర్ ఇంత స్పెషల్ అవ్వడానికి కారణం వారిద్దరి కాంబినేషన్‌లో మొత్తం నాలుగు సినిమాలు రావడం. టెంపర్, బృందావనం, బాద్‌ష, జనతా గ్యారేజ్ ఇలా నాలుగు సినిమాల్లో వీరిద్దరూ కలిసిన నటించారు. ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇంత లక్కీ హీరోయిన్ కూడా ఎవరు ఉండరు. ఇక ఎన్టీఆర్‌తో కలిసి నటించడం వల్ల ఈ సినిమాలతో కాజల్‌కు కూడా మంచి పేరు వచ్చింది. ఈ కారణంగానే ఎన్టీఆర్ పై కాజల్ ఎప్పుడూ తన అభిమానాన్ని చూపిస్తూ ఉంటుంది.