” గుంటూరు కారం ” ఐటెం సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్… చూస్తే మెంటలిక్కిపోద్ది…!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఇక ఈయన తాజాగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని మాస్ మసాలా యాక్షన్ డ్రామాగా రూపొందించాడు త్రివిక్రమ్.

మరి ఈ మూవీ షూటింగ్ మేకర్స్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే మేకర్స్ ఓ మెలోడీ సాంగ్ ని కంప్లీట్ చేయగా దాని గురించి ఇప్పుడు అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సాలిడ్ ఐటమ్ నెంబర్ కూడా ఉందని తెలిసిందే. మరి దీనిపై ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సాంగ్ కోసం అయితే ఇంకా ఏ హీరోయిన్ ని ఫిక్స్ చేయలేదట మేకర్స్.

ప్రస్తుతానికి కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ వారిలో ఒక పేరు ఫైనల్ అయిన వెంటనే సాంగ్ షూట్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ 25వ లోపే ఈ మూవీ మొత్తం కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సాంగ్ పై త్వరలోనే క్లారిటీ రానుంది.