వెంకటేష్ సౌందర్య హీరోయిన్ గా నటించిన ” దేవి పుత్రుడు ” మనందరికీ తెలుసు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అప్పట్లో ఓ రేంజ్ లో హిట్ అయింది. ఇక ఇప్పటికీ ఈ సినిమాను టీవీలో చూస్తే వదిలిపెట్టరు. ఈ సినిమాలో వెంకటేష్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ చిన్న పాప కూడా ఉంటుంది.
తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ ఆ చిన్న పాప రూపాన్ని ఎవ్వరూ మర్చిపోలేనంత గా నటించింది. అయితే ఆ చిన్న పాప ఇప్పుడు పెద్ద పాప అయింది. చిన్నప్పటి ఫోటోలు, రీసెంట్ గా ఆమె ఎలా ఉంటుందో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులు కొంతకాలం నటించిన తర్వాత గ్యాప్ ఇచ్చి తరువాత మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండి.. అవకాశాలు వస్తే సినిమా ఇండస్ట్రీలోకి వస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో వారి ఫోటోలు వైరల్ అవ్వడం సాధారణమే. ఇక ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.