ఈ ఫోటోలో క్యూట్ గా స్మైల్ ఇస్తున్న పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు త్రోబ్యాక్ థీంతో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత, రష్మిక, పూజ హెగ్డే, అల్లు అర్జున్, శ్రీ లీల, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్ల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తమ ఫేవరెట్ నటి,న‌ట్టుల‌ చిన్నప్పటి విషయాలు పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఉంటుంది. అప్పట్లో వారు ఎలా ఉండేవారు చూసేందుకు నెటిజ‌న్స్ కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ నెట్టింట‌ తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే పైన చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న బుజ్జి పాప టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. చందమామ దివి పైకి వచ్చి చిన్న నవ్వునవుతుందా అన్నట్లు కనిపిస్తున్న ఈ బుడ్డి పాప టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకే ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ బ్యూటీ తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఆమెకు అదృష్టం కలిసి రాలేదని చెప్పాలి. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో లైంగిక వేధింపులకు గురవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడిప్పుడే రీఎంట్రికి రెడీ అవుతున్న ఈ టాలీవుడ్ సుందరి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.

ఆమె హీరోయిన్ భావన. భావన అసలు పేరు కార్తీక్ మీనన్. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరును భావనగా మార్చుకుంది. కన్నడ భాషలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరో శ్రీకాంత్.. మహాత్మ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాకు ఆమెకు ప్రశంసలు కూడా అందాయి. అయితే ఆమె కేవలం దశాబ్దం పాట ఇండస్ట్రీలో కొనసాగిన.. 70 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న టైంలోనే లైంగిక వేధింపులు ఎదురు కావడంతో ఇక సినిమాలకు దూరమైపోయింది. తనపై జరిగిన కిడ్నాప్ గురించి ఆ వేధింపుల గురించి మొదటిసారి మిడియా ముందు రియాక్ట్ అయింది భావన. కన్నడ మూవీ ప్రొడ్యూసర్ నవీన్‌ను.. భావన 2018లో వివాహం చేసుకుంది.