నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ కి ఏకంగా ఇంత మంది హీరోయిన్లను పరిచయం చేశాడా.. ఆ లిస్టు ఇదే..

ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిన వారిలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాని తర్వాత హీరోగా మారి భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. నాచురల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న నాని దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక నాని తన సినీ కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇక నాని పరిచయం చేసిన ఆ హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

కలర్స్ స్వాతి :


నాచురల్ స్టార్ నటించిన మొదటి సినిమా అష్టా చమ్మా.. ఈ మూవీతో యాంకర్ కలర్స్ స్వాతి కూడా హీరోయిన్గా టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా టాలీవుడ్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.

నిత్యామీనన్ :


నాని నటించిన అలా మొదలైంది సినిమాతో మలయాళీ కుట్టి నిత్యమీనన్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పాపులారిటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత పలు సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా మారింది.

మాళవిక నాయర్ :


నాని హీరోగా, నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మలయాళీ భామ మాళవిక నాయర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ కీలకపాత్రలో నటించాడు.

మెహ్రీన్ పిర్జాదా :
కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాతో మెహరీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత పలు సినిమాలో నటించి ఆకట్టుకుంది.

నివేదా థామస్ :


నాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ మూవీ తో నివేద థామస్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇప్పటికి పలు సినిమాలో నటిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

అను ఇమ్మానుయేల్ :
మలయాళీ కుట్టి అనుఇమ్మానుయేలు కూడా నాని నటించిన మజ్ను సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది. పలు సినిమాల్లో నటించి క్రేజీ హీరోయిన్ గా పాపులర్ కి దక్కించుకుంది.

ప్రియాంక అరుల్ మోహన్:


నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంక అరుణ్ మోహన్ టాలీవుడ్ కి పరిచయమైంది. ప్రస్తుతం మ‌హేష్ గుంటూరు కారం సినిమాతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.

శ్రద్ధ శ్రీనాథ్ :


ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్‌ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో శ్రద్ధ శ్రీనాథ్ టాలీవుడ్ కి హీరోయిన్గా పరిచయం అయింది.