యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. యమదొంగ, కంత్రి, బృందావనం, జై లవకుశ వంటి సినిమాలలో తన డాన్సింగ్ స్కిల్స్ ను చూపించి ప్రేక్షకులని మెప్పించాడు తారక్. ఇక తారక్ తాజాగా నటిస్తున్న ” దేవర ” సినిమాలో సైతం ఈయన అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో అలరించబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే..ఢీ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో పండు ముందు ఉంటాడు.
ఇక ఈయన కూడా తారక్ డాన్సింగ్ స్కిల్స్ కి పెద్ద ఫ్యాన్ అట. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పండు మాట్లాడుతూ…” జై లవకుశ సినిమాలోని డ్రింక్ డ్రింక్ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇక అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లొకేషన్ కు వచ్చి.. మాస్టారు చెప్పిన 32 కౌంట్స్ ను గుర్తుపెట్టుకుని డాన్స్ చేశారు ” అంటూ చెప్పుకొచ్చాడు పండు.
అలాగే డాన్స్ మూవ్మెంట్స్ ను గుర్తుపెట్టుకుని స్టెప్స్ వేయడం డాన్సర్లు అయినా మాకే కష్టమని పండు తెలిపారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంత బాగా గుర్తు పెట్టుకుని స్టైలిష్ గా డాన్స్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం పండు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.