కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యష్.. కేజీఎఫ్ ను మించి ఉండబోతుందా..?!

జి ఎఫ్ 1, కేజీఎఫ్ 2 సిరీస్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు యంగ్‌హీరో య‌ష్. కేజీ ఆఫ్ చాప్టర్ 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మంచి పాపులారిటీ దక్కించుకున్న య‌ష్‌..తర్వాత సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గ రేంజ్ లోనే ఉండాలనే ఉద్దేశంతో ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నాడు. దీంతో నెక్స్ట్ నటించబోయే సినిమాపై ప్రేక్షకులతో పాటు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌లో కూడా ఆసక్తి నెలకొంది. తన సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కోట్లాదిమంది అభిమానులకు బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతకాలం గ్యాప్ తీసుకున్న య‌ష్ తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు.

ఇక య‌ష్‌19 సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న కేవీఎం ప్రొడక్షన్స్ తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ టైటిల్ ఈ నెల 8 ఉదయం 9గం.. 5ని.. ప్రకటించబోతున్నట్లుగా వివరించాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీ తో సంచలనాన్ని సృష్టించిన యష్.. తన నెక్స్ట్ సినిమాను ఎలా చేయాలనే దానిపై చాలా ఆలోచించించార‌ని.. అందరికీ నచ్చేలా.. అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథనే తీసుకుని ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు అంటూ మేకర్స్ ప్రకటించారు. పాన్‌ ఇండియా స్టార్ అవడంతో ఆ రేంజ్ లోనే ప్రేక్షకులు ఆకట్టుకునేందుకు ఈసారి కూడా సరికొత్త కథతో రంగంలోకి దిగాడు.

ఈ సినిమా తప్పకుండా అందరి అంచనాలను మించి ఉండబోతుంది.. అదేవిధంగా ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది.. గెటప్ ఎలా ఉండబోతుంది.. అనే అంశాలు అందరిలోనూ ఎక్సైట్మెంట్ ఇస్తాయి.. ఒక కొత్త గెటప్ తో పవర్ఫుల్ కంటెంట్ తో మంచి కథను ఎంచుకొని యాష్ మన ముందుకు రాబోతున్నాడు అంటూ వివరించారు. ఈ నెల 8న టైటిల్ అనౌన్స్మెంట్ కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన యాక్టర్స్, టెక్నికల్ టీం గురించి పూర్తి వివరాలు తెలియజేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు.