సాధారణంగా ప్రతి జంతువు ఆహారం తీసుకుంటూనే ఉంటుంది. ఏ జీవి అయినా ఆహారం లేకుండా బతకలేదేమో అని మనం అనుకుంటాము. కానీ అది తప్పు. ఈ జీవులు మాత్రం ఆహారం లేకుండా కొన్ని నెలలు పాటు బ్రతుకుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. ముసళ్లు:

ముసళ్లు నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు వీటి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో చాలా కాలం పాటు తినకుండా ఉంటాయి.
2. ఎలుగుబంటి:

ఎలుగుబంటికి నిద్రిస్తున్న సమయంలో ఆకలి గుర్తుకు రాదు. అందువల్ల ఎలుగుబంటి కూడా ఆహారం తీసుకోకుండా కొన్ని నెలలు పాటు బ్రతుకుతుంది.
3. ఎడారి కప్ప:

ఎడారి కప్ప బోరియల్లో ఇవి నివసిస్తాయి. నిద్రాణ స్థితిలో ఉన్న కప్పలు చాలా రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉండగలవు.
4. పింగ్విన్:

ఈ పక్షి గడ్డ కట్టించే అంటార్కిటికా కండంలో చలికాలంలో ఇవి గుడ్లు పొదుగుతుంటాయి. ఈ సమయంలో నాలుగు నెలల పాటు ఎటువంటి ఆహారం తీసుకోదు.
5. ఒంటె:

ఇది నీళ్లు లేకుండా చాలా రోజులు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి కూడా ఎటువంటి ఆహారం లేకుండా కొన్ని నెలలపాటు బ్రతక గలవు.
ఈ ఐదు జంతువులు మాత్రం ఎటువంటి ఆహారం లేకుండా కొన్ని నెలలు పాటు బ్రతక గలవు.

