టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా… ప్రేమించుకుని.. అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఏవో చిన్నచిన్న గొడవలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ.. వీళ్ళ అభిమానులు మాత్రం ఈ జంటని కలపడానికి నానా కష్టాలు పడుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే నవంబర్ 23వ తేదీన నాగచైతన్య పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి హంగామా లేకుండా ఎంతో సైలెంట్ గా నాగచైతన్య బర్తడే జరిగిపోయింది. అయితే సమంతతో విడిపోయినప్పటి నుంచి చైతన్య పెద్దగా పార్టీలకు హాజరు కావడం లేదు. ఈ క్రమంలో సమంత మాత్రం మాజీ భర్త పుట్టినరోజు నాడు శివుని గుడిలో ప్రత్యేకంగా అభిషేకం చేయించిందట.
చైతుకి విష్ చేయకపోయినప్పటికీ… తన మాజీ భర్త ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకుంటూ పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రేక్షకులు…” ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ బయటపడడం లేదు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.