టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఈమె ది మార్వెల్ సినిమాలలో భాగమైంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ‘ది మార్వెల్’ అనే సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వర్షన్ ని సమంత ప్రమోట్ చేస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ప్రెస్ అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమంత ఎంతో ఓపికతో సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ సమంతను ప్రశ్నిస్తూ… తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లేదా ఒక సూపర్ హీరో సిరీస్ ను తీస్తే మీరు ఏ హీరోని ఎంపిక చేసుకుంటారు అంటూ ప్రశ్నించగా… ” ప్రస్తుతం నా లిస్టులో అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో ” అంటూ పేర్కొంది. ” అల్లు అర్జున్ అంటే పిచ్చి.. అతని నా సూపర్ హీరో.. ఆయనతో పాటు విజయ్ దేవరకొండ కూడా ” అంటూ చెప్పింది.
అల్లు అర్జున్ తమ సూపర్ హీరో అని చెప్పడంతో అల్లు ఫ్యాన్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సమంత పై ఫైర్ అవుతున్నారు. విజయ్ దేవరకొండ కి ఈమెకి ఒక సినిమా పరిచయం అయినప్పటికీ.. గతంలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారు అనే వార్తలు సైతం వచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అందరి ముందే… నా హీరో విజయ్ దేవరకొండ అంటూ చెప్పడంతో బహుశా ఈమెకు, విజయ్ దేవరకొండకు ప్రేమాయణం నడుస్తుందంటూ వస్తున్న వార్తలు నిజమే ఏమో అనే సందేహం ఫాన్స్ లో కలుగుతుంది.