రౌడీ హీరో ఇంట రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్..

నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టింది. ఛ‌ల్లో, గీతగోవిందం, సరిలేరు నీకు ఎవరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తన ఖాతాలో వేసుకొని టాలీవుడ్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇక రష్మిక.. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించింది. ఈ రెండు సినిమాల్లో వీరిద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ లో లిప్ లాక్ సీన్స్ కు కొదవ ఉండదు. అయితే ఈ మూవీ షూటింగ్స్ లో ఒకరికి ఒకరు దగ్గరయ్యారు అనడంలో సందేహం లేదు.

ఇప్పటికే వీరిద్దరూ ముంబైలో కలిసి చెక్క‌ర్లు కొడితే చాలా సార్లు కెమెరాకు దొరికారు. అలాగే రెండుసార్లు మాల్దీవ్స్‌ కూడా కలిసి వెళ్లారు. వీటిపై రష్మికను అడగక స్నేహితులతో వెకేషన్స్ కి వెళ్లకూడదా అంటూ సమాధానం చెప్పి తప్పించుకునేది. కాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ట్రిప్స్ లో కూడా రష్మిక జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న సెలబ్రేషన్స్ లో కూడా రష్మికకు ఆహ్వానం తప్పకుండా ఉంటుంది. అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బేబీ మూవీ ప్రమోషన్స్ లో కూడా రష్మిక సందడి చేసిన సంగతి తెలిసింది.

ఇవన్నీ విజయ్‌తో ప్రేమలో ఉంది కాబట్టి అతడి కోసమే చేస్తుందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇక తాజాగా దివాళి సెలబ్రేషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక సందడి చేసింది. దీంతో మరోసారి విజయ్ , రష్మిక ప్రేమికులంటూ వార్త వైరల్ అవుతుంది. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తున్నాడు. అలాగే రష్మిక పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే రష్మిక పాన్ ఇండియా లెవెల్లో రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన యానిమల్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.