తప్ప తాగి కీర్తి సురేష్ పై దాడి చేసిన ఓ వ్యక్తి… ఎందుకో తెలుసా…!!

ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. తమిళంలో అరంగేట్రం చేసిన చాలామంది స్టార్ కిడ్స్ వచ్చినంత వేగంగా ఫేమ్ అందుకోలేకపోయారు. కానీ కీర్తి మాత్రం వరుస హిట్లతో దూసుకుపోయింది. స్టార్ ఇమేజ్ ను సైతం సొంతం చేసుకుంది. ఇక ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ… తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాలను పంచుకుంది. ఈమె మాట్లాడుతూ…” నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో రోడ్డు మధ్యలో నా స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాను.

ఇంతలో ఓ తాగుబోతు వచ్చి నాపై చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో ఒక్క నిమిషం ఆగి తన చెంప చెల్లుమనిపించాను. దీంతో అప్పుడే ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నందుకు అందరూ మెచ్చుకున్నారు ” అంటూ తెలిపింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.