సినీ తారల చిన్ననాటి ఫొటోస్ ఎప్పుడు సోషల్ మీడియాలో త్రో బ్యాక్ థీంతో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫోటోలో క్రికెట్ కింగ్ సచిన్ తో కలిసి నుల్చున ఈ బాబు ఎవరో గుర్తుపట్టారా.. ఈ చిన్నోడు ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరో.. అంతేకాదు అతడు చేసిన సినిమాలు తక్కువ అయినా.. మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ హృతిక్ రోషన్ అంటూ ఈ కుర్రాన్ని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కనిపెట్టేసి ఉంటారు లేండి.
ఎస్ అతనే టాలీవుడ్ హీరో రోషన్ మేక. సీనియర్ హీరో శ్రీకాంత్ నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. సీనియర్ శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు అతడి కొడుకు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. నిర్మల కాన్వెంట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన రోషన్ తర్వాత పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా కె.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కింది.
ప్రస్తుతం రోషన్ మరో కొత్త సినిమాలో నటిస్తున్నాడు. ఇక పెళ్ళిసందడి సినిమాతో రోషన్ తో కలిసిన శ్రీ లీల ఏ రేంజ్లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రోషన్ నటిస్తున్న ఈ సినిమా వృషభ అనే టైటిల్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ రానున్నాయి.