ఈ చిన్నారిని గుర్తుపట్టారా… అదేనండి చంద్రముఖి సినిమాలో పాప… ఈమె ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్…!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా మనందరికీ ఇప్పటికీ గుర్తుంది. ఇటీవల చంద్రముఖి 2 కూడా వచ్చింది. అయితే చంద్రముఖి సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఈ సినిమాలో ఓ పాటలో ప్రకర్షిత అనే చిన్నారి నటించింది. ఇప్పుడు ఆ పాప ఎలా ఉంది? ఎక్కడుంది? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉన్నాయి. ప్రకర్షిత 90 ల నాటి పిల్లలకు ఇష్టమైన సీరియల్ వేలన్ తో సహా అనేక సీరియల్ లో నటించింది.

ఈ సీరియల్ తో ప్రకర్షిత 90ల నాటి చిన్నారుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిన్నారి 2005లో రజనీకాంత్ నటించిన తమిళ్ మూవీ చంద్రముఖిలో బొమ్మ పాత్రను పోషించింది. అలాగే ఈ పాత్ర ఆధారంగా ఒక పాటను సైతం సినిమాలో ప్రదర్శించారు. బ్లాక్ బస్టర్ సినిమాలో చాలా తక్కువ సేపు కనిపించినప్పటికీ.. నయనతార కోసం రజనీకాంత్ సంగీత్ గురించి బొమ్మ బొమ్మతో చెప్పిన పాట అందరి దృష్టిని ఆకర్షించింది.

సీరియల్స్, సినిమాలలో నటించిన ఈ చిన్నారి.. మరోపక్క చదువును సైతం కొనసాగించింది. ఈమె చదువు పూర్తయిన తర్వాత ఈమె ఓ అబ్బాయిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా జన్మించింది. ఈమె ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన భర్త, బిడ్డతో కలిసి ఫోటోలు సైతం షేర్ చేస్తుంది. అలాగే ప్రస్తుతం సీరియల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ప్రకర్షిత.. త్వరలో వెండితెర పైకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి.