టాలీవుడ్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.” అర్జున్ రెడ్డి ” సినిమాతో రౌడీగా పేరు పొందిన విజయ్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక విజయ్ దేవరకొండ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం విజయ్.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. కానీ దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విజయ్ దేవరకొండ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తే… ఆ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అంటూ రౌడీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న ఈ హీరో… బాలీవుడ్ కి అడుగుపెట్టి ఇంకే రేంజ్ లో షేక్ చేస్తాడో చూడాలి.