రణ్వీర్ తో పెళ్లికి ముందే ఓ ఇద్దరు హీరోలతో డేటింగ్ చేసినట్లు నటి దీపిక పదుకొణె ఒప్పుకుంది. ” కాఫి విత్ కరణ్ సీజన్ 8 ” ఫస్ట్ ఎపిసోడ్ కు భర్త రణ్వీర్ తో కలిసి హాజరైన దీపిక.. పర్సనల్ ఇష్యూస్ పై మాట్లాడింది. ” రణ్వీర్ తో పెళ్లికి ముందే ఇద్దరితో స్నేహంగా మెలిగాను. కానీ వాళ్లు నా అభిప్రాయాలను గౌరవించలేదు. అందుకే గుడ్ బై చెప్పేశా. అయితే వాళ్లతో ఏ విషయంలోనూ పరిధులు దాటలేదు ” అంటూ చెప్పుకొచ్చింది దీపిక.
ఇంకా ఆమె మాట్లాడుతూ..” రణ్వీర్ విషయంలోనూ తన ప్రపోజ్ చేసే వరకు మౌనంగానే ఉన్నాను. ఇప్పుడు మేము ఒకరి కోసం ఒకరం బతుకుతున్నాం. ఇప్పటికీ వృత్తిరీత్యా చాలామందిని కలుస్తుంటాను. కానీ నా గమ్యం రణ్వీర్ . నేను అతనికి కట్టుబడి ఉన్నాను. కలిసి బతకడం అంటే సమ్మకంతో బతకడమే”..అంటూ ఎమోషనల్ గా స్పందించింది.
అంతేకాదు “మా మధ్యలో ఫిల్టర్ అంటూ ఉండదు ” అంటూ చెకూసింత ఘాటూగానే ప్పుకొచ్చింది. దీపిక వ్యాఖ్యలు విన్న ప్రేక్షకులు.. ఆ ఇద్దరితో ఏం చేశావో ఎవరికి తెలుసు. రణ్వీర్ కి కూడా తెలియదు కదా. అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ జంట ఎల్లప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆశీర్వదిస్తున్నారు.