తాజాగా కిరణ్ అబ్బవరం – నేహా శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ రూల్స్ రంజన్. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మంచి జోరుగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన సమ్మోహనుడా సాంగ్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి హైప్ సాధించింది. ఈ సాంగ్ తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజై మొదటి షో తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఈ మూవీ ఫేమ్ నేహా శెట్టి సినిమాకు మరింత హైఫ్ తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు. ఈమెకు కుర్ర కారులో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కిరణ్ అబ్బవరం తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఇందులో భాగంగా ఓ నెట్టిజన్ అడిగిన ప్రశ్నకు కిరణ్ చెప్పిన సమాధానం వైరల్ గా మారింది. ఓ నెట్టిజన్ మాట్లాడుతూ అన్న.. రూల్స్ రంజన్ మూవీ హిట్ అయిన తరువాత బిగ్‌బాస్ 7 రతికా లాంటి అమ్మాయి నీకు భార్యగా రావాలి అంటూ కామెంట్ చేశాడు.
దీనికి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ తమ్ముడు నీకు నాపై అంత పగ ఎందుకు పెళ్ళైతే చేసుకుందాం. కానీ ఎలాంటి అమ్మాయి వస్తుందో తర్వాత చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన రితిక అందరితో గొడవ పడుతూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంది దీంతో ప్రేక్షకుల్లో నెగిటివిటి కారణంగా రతిక గత ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రతీక పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.