వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు ఎవరనే అంశంపై చాలా మందిలో ఆశక్తి ఉంటుంది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజ గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్ 1996 – 2007 మధ్యలో 39 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ లో మెక్‌గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి. ఈ జాబితాలో స్పిన్ లెజెండ్, శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ రెండో స్థానంలో ఉన్నాడు. మురళి 1996-2011 మధ్యలో 40 మ్యాచుల్లో 68 వికెట్లు పడగొట్టాడు. ఇందులో నాలుగు వికెట్లు ఘనతలు ఉన్నాయి.
ప్రపంచ కప్ లో మురళి అత్యుత్తమ గణాంకాలు 4/19 గా ఉన్నాయి. మూడో స్థానం విషయానికొస్తే.. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ఈ స్థానాన్ని ఆక్యూపై చేశాడు. మలింగ 2007-2019 మధ్యలో 29 మ్యాచ్‌లలో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్లు ఘనతలు, ఓ ఐదు వికెట్లు ఘనత ఉన్నాయి. ప్రపంచ కప్ లో మలింగ అత్యుత్తమ గణాంకాలు 6/38 గా ఉన్నాడు. మలింగ తరువాత వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బోలర్‌గా పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ నీలిచాడు. అక్రమ్ 1987 – 2003 మధ్యలో 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచ కప్ లో అక్రమ్ అత్యుత్తమ గణాంకాలు 5/28 గా ఉన్నాడు.
ఈ జాబితాలో భారత బౌలర్ జహీర్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచాడు. జహీర్ 2003-2011 మధ్యలో 23 మ్యాచ్‌లలో 44 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ నాలుగు వికెట్ల ఘనత ఉంది. ప్రపంచ కప్ లో జహీర్ అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న బౌలర్లలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ 18 మ్యాచ్‌లు 49 వికెట్లు ఐదో స్థానంలో.. కివీస్ స్పీడ్‌గన్ ట్రెంట్ బౌల్ట్ 19 మ్యాచులు 39 వికెట్లు 10వ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఐదవ తేదీ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది.