ఇండియాలో అలాంటివి చేయరు.. ఈ సీన్ నేను చేయలేను.. సీనియర్ నటి సుహాసిని..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి పాపులారి దక్కించుకుంది సుహాసిని. హోమ్లీ హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించినా గ్లామర్ షో గాని హద్దులు మీరి డ్రెస్సింగ్ తో గాని ఎక్కడ కనిపించదు. తనకున్న గుడ్ క్వాలిటీస్ లో డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటి. ఇప్పటికీ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ బిజీగా గడుపుతున్న సుహాసిని తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో వ్యవహరించింది.

ఓ సినిమా కోసం హీరో ఒడిలో కూర్చోవాలని.. అతని ఎంగిలి చేసిన ఐస్‌క్రీమ్‌ తినాలని నాపై డైరెక్టర్ ఒత్తిడి తెచ్చారని వివ‌రించింది. ఇలాంటివి ఇండియాలో చేయరు ఆ ఐస్‌క్రీమ్‌ మార్చండి. లేదంటే నేను ఆ సీన్‌ చేయను అంటూ చెప్పేసిందట. అప్పుడు అక్క‌డున్న వాళ్లంతా షాక్ అయ్యారట. అలాగే న‌టి శోభనకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని.. ఆమె కొన్ని సీన్లకు అభ్యంతరం చెప్పగా దీంతో నువ్వు ఏమైనా సుహాసిని అనుకుంటున్నావా.. చేయనని చెప్పడానికి అంటూ సీరియస్ అయ్యారట‌.

వెంటనే ఆమె నాకు కాల్ చేసి ఆ విషయాన్ని చెప్పింది. నచ్చని సీన్లు సుహాసిని చేయదు అనే స్ట్రాంగ్ మెసేజ్ అందరిలో రీచ్ అయిందని నాకు అప్పుడే అర్థమైంది అంటూ సుహాసిని వివరించింది. ప్రస్తుతం సుహాసిని చేసిన ఆ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సుహాసిని అంటే ట్రెడిషనల్ బ్యూటీ అని అందరికీ తెలుసు.. అయితే ఇంత ధైర్యంగా తను మనసులో అనుకున్నది చెప్పేసే హీరోయిన్ అని ఇప్పుడే తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.