ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇవ్వగానే సరిపోదు… గుర్తింపు తెచ్చుకోవాలంటే లక్ ఉండాల్సిందే. అలాంటి లక్ తో దూసుకుపోతుంది శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి.. ధమాకా తో హిట్ కొట్టింది. మొదటి సినిమాలోని ఈమె అందం, నటన, డ్యాన్స్ చూసి డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈమె కాల్ షీట్ కోసం క్యూ కట్టారు.
చేతినిండా డజను సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె పేరు మారుమోగుతుంది. చిన్న హీరో పెద్ద హీరో అని కాకుండా అందరితో జత కడుతుంది. ఇక తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని శ్రీ లీల రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసిందట. ముందుగా కోటి రూపాయలు తీసుకున్న శ్రీ లీల.. ఆ తర్వాత రెండు కోట్లు.. ఇప్పుడు ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తుందట.
అయితే ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన శ్రీ లీల ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపించాయి. పాన్ ఇండియా స్టార్ అయినా పారితోషకం విషయంలో మాత్రం తగ్గేదేలే అందట. దీంతో ప్రజెంట్ ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు అడిగినంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట.