బిగ్ బాస్ హౌస్ లో హింసకు చోటు లేదు. ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్ నాటి నుంచి ఈ రూల్ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్స్‌కు కోటింగ్ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమి కొట్టుకున్నంత ఫిజికల్ టాస్క్ కాదు. అయినా తేజ బెల్టుతో గౌతమ్‌ను టపా టపా కొట్టాడు.
హౌస్ లో ఉన్న వాళ్లకు ఎలా ఉందో కానీ చూసే జనాలుకు మాత్రం గొడ్డును బాదినట్లు బాదాడు అనిపించింది. తను కావాలని చేయకపోయినా బెల్ట్ తో మెడపై అంత గట్టిగా కొట్టడం.. అక్కడ ఉన్నవాళ్లు వద్దని అరుస్తున్న తన చర్యలు ఆపకుండా చేయడం నాగార్జునకి కోపం రప్పించాయి. ఇలాంటి అరాచకాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. గౌతమ్ ను తేజ ఎలా బెల్టుతో కొట్టాడు నాగ్ వీడియో చూపించాడు. అన్నిటికీ బాస్ లా పోజు కొట్టే శివాజీ సైతం నెమ్మకు నీరెత్తునట్లు ఉండిపోయాడు.
మీ ఇద్దరికీ కళ్ళు కనబడడం లేదా? అని తిట్టాడు నాగార్జున. తర్వాత తప్పు చేసిన తేజను చెడుగుడు ఆడేశాడు. అక్కడ అమ్మాయిలు భయంతో అరుస్తుంటే వినబడలేదా? అని ప్రశ్నించగా.. అది ఎంకరేజ్మెంట్ అనుకున్నానని తేజ చెప్పాడు. తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేయాలని కంటెస్టెంట్స్ ని అడిగాడు. శుభశ్రీ.. అతడిని జైల్లో వెయ్యాలంది. ప్రియాంక సైతం జైలు శిక్ష వెయ్యాలంది. సందీప్ అయితే ఏకంగా అతడిని బయటకు పంపించేయండి అన్నాడు. దీంతో తేజ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.