గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై చరణ్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గతంలో పలు వార్తలు వినిపించాయి. అయితే గేమ్ చేంజర్ 2024లో వచ్చే ఛాన్సెస్ లేదని తాజాగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దానికి కారణం ప్రస్తుతం మరోవైపు కమల్‌తో చేస్తున్న భారతీయుడు 2 తో పాటు దానికి సీక్వెల్ గా భారతీయుడు 3 నీక్కూడా శంకర్ తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ వచ్చే ఏడాది కూడా రాదని టాక్. మొత్తానికి అసలు తమ హీరో యొక్క సినిమా విషయంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని.. అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ పై మేకర్స్ ఇకనైనా క్లారిటీ ఇస్తే బాగుంటుందని.. అప్పటివరకు మాకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని రామ్ చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై గేమ్ చేంజర్ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారు చూడాల్సి ఉంది.