మెగా డాటర్ నిహారిక అందరికీ సుపరిచితమే.. మొదట ఈ అమ్మడు యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి అలరించింది. అయితే 2020లో నిహారిక కు, జొన్నలగడ్డ చైతన్యతో పెద్దలు పెళ్లి చేశారు. వీరి కాపురం కొద్ది రోజులు సాఫీగానే సాగింది.
కానీ ఇటీవల ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నిహారిక మాత్రం తన లైఫ్‌ను ఇతర ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.
7G బృందావనం కాలనీ మూవీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ” కన్నుల బాసలు తెలియవులే ” అని సాగే ఎమోషనల్ పాటను షేర్ చేసింది. దీంతో నిహారిక భర్తను మర్చిపోలేక పోతుంది అందుకే ఇలా ఎమోషనల్ అవుతుందని నెట్టిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్నేళ్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి ఆమె ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ను పెట్టడంతో చైతన్య కోసమే పెట్టిందని భావిస్తున్నారు.