సోదరుడికి రాఖీ కడుతూ క్యూట్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టా.. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుం ది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సినిమా అవకాశాలు రాక సతమతమవుతుంది.
గతంలో ఇమె నటించిన సినిమాలు అన్ని వరుసగా డిజాస్టర్లు అవ్వడంతో ఈ బ్యూటీకి మెల్లగా అవకాశాలు తగ్గాయి. తాజాగా ఒప్పుకున్న సినిమా నుంచి కూడా తప్పుకుంది. ఇక బాలీవుడ్‌లో అడపా దడపా అవకాశాలను అందుకుంటునా అక్కడ నిరాశ ఎదురయింది. అయితే ఇటీవలే ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయంటూ న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా గుర్తుపట్టారా ఈమె ఎవరో తనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే.
ఈరోజు(అక్టోబర్ 13) ఆమె పుట్టిన రోజు. 1990లో మొబైల్లో జన్మించిన పూజ 2014లో ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. అక్కినేని నాగచైతన్య సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత ఎన్నో హిట్ సినిమాలో నటించిన ఈమె గత కొంతకాలంగా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్‌గా ముద్ర వేసుకుంది. ఇక ఇటీవల హిందీలో కిసికా భాయ్ కిసిక జాన్ లో నటించిన అయితే ఈ సినిమా కూడా సక్సెస్ అందుకోలేదు.
ఇక ఇప్పటివరకు పూజ రూ51 కోట్ల ఆస్తిని సంపాదించుకుందట. అలాగే ఆమె వద్ద ఖరీదైన లగ్జరీ కార్లు, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. పూజకి హైదరాబాద్ ముంబైలో లగ్జరీ హౌస్ లు కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన పూజా హెగ్డే కు ఇటీవల సినిమాల్లో అవకాశాలు క్యూ కడుతున్న అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాబోయే సినిమాలతో అయినా బుట్ట బొమ్మ సక్సెస్ అందుకుని మళ్ళీ స్టార్‌డంను కొనసాగిస్తుందో లేదో చూడాలి.